ఎండమావిగన్...ఆచరణలో ఎపుడయ్యెన్ ?
ఎండ మావులను చూసి నీరు ఉందని భ్రమిస్తారు. కానీ నిజానికి అక్కడ ఏమీ ఉండదు, అలాంటివే అనేక ప్రతిపాదనలు వస్తూంటాయి.;
ఎండ మావులను చూసి నీరు ఉందని భ్రమిస్తారు. కానీ నిజానికి అక్కడ ఏమీ ఉండదు, అలాంటివే అనేక ప్రతిపాదనలు వస్తూంటాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఒక ప్రతిపాదన అమరావతి రాజధానికి ఆల్టర్నేషన్ గా చేసింది. దానిని ప్లాన్ బీగా చెప్పుకుంటోంది. దానికి మావిగన్ అని పేరు కూడా పెట్టారు. అయితే ప్రత్యర్థులతో పాటు విమర్శలు బుద్ధి జీవులు అంతా అది మావిగన్ కాదు ఎండమావిగన్ అని అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రతిపాదన చాలా ఆలస్యంగా వచ్చింది. అంతే కాదు ఇపుడు ఏపీలో ఉన్న పరిస్థితుల్లో దీని సాధ్యాసాధ్యాలు పరిశీలించిన వారు అయ్యేది ఉండదని అంటున్నారు.
అమరావతిని కదపడం :
మావిగన్ అంటే ఉన్న అమరావతి రాజధాని కదపడమే. అది ఆచరణలో అయ్యేనా అంటే కాదనే చెబుతారు. ఎందుకంటే అమరావతికి ఇపుడు చట్ట బద్ధత అనే రాజ్యాంగ భద్రత ఉంది. అంతే కాదు న్యాయపరమైన రక్షణ కూడా ఉంది. అమరావతి రాజధానిగా ఏపీకి నిర్ణయిస్తూ పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి రాజ ముద్రతో ఇక రావడమే ఆలస్యం. అది కూడా జరిగి తీరుతుంది. అలాంటి అమరావతిని కదపడం సాధ్యమా అంటే అసాధ్యం అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
వైసీపీ వచ్చినా కూడా :
ఇక రేపటి రోజున ఏపీలో వైసీపీ అధికారం చేపడితే అమరావతికి బదులుగా మావిగన్ అంటూ రాజధాని మార్పు చేయడం సాధ్యమేనా అంటే కాదనే చెబుతారు. ఎలా అంటే పార్లమెంట్ లో మెజారిటీ సభ్యులు విభజన చట్టంలోని సవరణను ఆమోదించాలి. నిన్న అంతా చూశారు, అధికార బీజేపీ విపక్ష కాంగ్రెస్ సహా దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి జై కొట్టాయి. మళ్లీ అమరావతి కాదు మావిగన్ పేరుని చేర్చాలని అంటే మాత్రం వారు ఎందుకు అంగీకరిస్తారు. పైగా అక్కడ అప్పటికి ఎంతో కొంత నిర్మాణాలు జరుగుతాయి కదా ఆ భూములను ఏమి చేస్తారని ప్రశ్నించకుండా ఉండరు కదా అని మేధావులు అంటున్నారు.
2019 కి 2029కి భారీ తేడా :
ఇక 2019లో అయితే అమరావతిలో ఏమీ వర్క్ జరగలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని ప్రతిపాదించగలిగింది. అయినా సరే న్యాయ స్థానాలలో అది వీగిపోయింది. కానీ ఎంత కాదనున్నా 2029 నాటికి అమరావతి రాజధానికో కీలక ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుంది. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములలో నిర్మాణాలు జరిగితే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ విషయం ఎవరూ చెప్పలేరు కానీ కూటమి ప్రభుత్వం అయితే పట్టుదలగా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత మేర ప్రగతి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ముందుకు సాగుతారు తప్ప వెనక్కి వెళ్ళేది ఉండదు, దాంతో రేపటి రోజున వైసీపీకి అధికారం దఖలు పడి ఆ పార్టీ ఎంపీల మద్దతు కేంద్రానికి అవసరం అయినా ఈ విషయంలో మాత్రం కేంద్రం నుంచి సాయం చేసేది ఉండదు, పైగా ఒక చోట రాజధాని అనుకుని కొంత పనులు చేసి మళ్ళీ మారుస్తామంటే జనాలు కూడా నెగిటివ్ అవుతారు అన్నది అంతా గుర్తుంచుకోవాల్సి ఉంది.
ఆల్టర్నేషన్ గానే :
అయితే వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం మావిగన్ పేరుతో విజయవాడ గుంటూరు, మచిలీపట్నమలో కొంత మేర అభివృద్ధి చేయవచ్చు. లేదా ఇంకా ముచ్చట పడితే సీఎం ఆఫీసు కూడా అక్కడ నుంచి నడపవచ్చు కానీ అమరావతి రాజధాని మాత్రం అలాగే చట్టబద్ధతతో ఉంటుంది. పైగా అమరావతిలోనే అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉంటే వేరే చోట నుంచి పాలన జరిపించడం కూడా ఆచరణలో అంత సహేతుకం అనిపించుకోదు. ఏది ఏమైనా మావిగన్ అన్నది ఎండమావిగా మారుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.