హాట్ లైన్ కాంబినేషన్...జగన్ కేసీఆర్ అమిత్ షా అండ్ బాబు రేవంత్ రాహుల్ !
ఇదిలా ఉంటే హాట్ లైన్ అన్న పేరు జనరల్ గా టెస్లా మధ్య జరిగిన సంభాషణల గురించి అంతా మాట్లాడుకుంటారు. దానిని పొలిటికల్ గా ట్విస్టులు పెట్టి కన్వర్ట్ చేయడం ద్వారా జగన్ రాజకీయ కాకనే పుట్టించారు.;
తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు హాట్ లైన్ కాంబినేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ హాట్ లైన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకూ రాహుల్ గాంధీకి హాట్ లైన్ కలిపేశారు. మధ్యలో రేవంత్ రెడ్డిని కూడా తెచ్చారు. దీంతో రాజకీయంగా ఇది రచ్చ చేస్తోంది. కాంగ్రెస్ ఏపీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ నుంచి తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ వరకూ అంతా జగన్ మీద గట్టిగానే ఎటాక్ చేశారు. ఇంకా బ్యాలెన్సులు చాలానే ఉన్నాయి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ హాట్ లైన్ ఏమిటి దీని కధా కమామీషూ ఏమిటి అన్నది అంతా ఆలోచిస్తున్నారు.
హాట్ లైన్ అలా పాపులర్ :
ఇదిలా ఉంటే హాట్ లైన్ అన్న పేరు జనరల్ గా టెస్లా మధ్య జరిగిన సంభాషణల గురించి అంతా మాట్లాడుకుంటారు. దానిని పొలిటికల్ గా ట్విస్టులు పెట్టి కన్వర్ట్ చేయడం ద్వారా జగన్ రాజకీయ కాకనే పుట్టించారు. జగన్ అలా రాష్ట్ర నాయకులకు జాతీయ కాంగ్రెస్ నాయకులకు మధ్య హాట్ లైన్ పెట్టారు. దీంతో ఒక్కసారిగా హాట్ లైన్ అన్న పదం వైసీపీ సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అంతే కాదు దానికి వెంటనే టీడీపీ సోషల్ మీడియాలో రియాక్షన్స్ వచ్చేసాయి. వారు కూడా ధాటీగా కౌంటర్ ఎటాక్ ని ధీటుగా చేస్తున్నారు.
అసలు అయ్యే పనేనా :
నిజానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీల మధ్య హాట్ లైన్ వ్యవహారం అయ్యే పనేనా అని అంతా చర్చిస్తున్నారు. ఇందులో ఎన్నో లాజిక్కులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఇది అసలు కుదిరే పనే కాదు అని అంటున్నారు. ఎందుకు అంటే జవాబు వెరీ సింపుల్. ఎవరి రాజకీయాలు వారికి ఉంటాయి. ఎవరి పరిస్థితులు పరిమితులు అవసరాలు అన్నీ కూడా వారికి పక్కాగా తెలుసు. అందువల్ల ఇంతలో ఏమి కొంప మునిగిందని ఉన్న చోట నుంచి వేరే చోటకు హాట్ లైన్ వ్యవహారాలను నడుపుతారు అన్నది కూడా చర్చకు వస్తోంది.
అంతా మోడీకే హాట్ లైన్ లో :
ఇదే నిజం. ఇదే రాజకీయంగా జరుగుతుంది దీనికే లాజిక్ పక్కాగా ఉంది అని అంటున్నారు. అనాలంటే ఇలాగే అనుకోవాల్సింది తప్పించి వేరేగా అనడానికి ఆలోచించడానికి సైతం అసలు పొలిటికల్ లెక్కలు ఏ మాత్రం ఒప్పుకోవని అంటున్నారు. ఇక ఏపీ నుంచి చూసినా తెలంగాణా నుంచి చూసినా రాజకీయాలలో చాలా విషయాలు బోధపడతాయని అంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉంటే ఆయనతో బాగానే ఉన్నారు కదా అని గుర్తు చేస్తున్నారు.
అంతే కాదు తెలంగాణాలో కేసీఆర్ కూడా చాలా బిల్లుల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సంగతిని సైతం గుర్తు చేస్తున్నారు. ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే మోడీతో జట్టు కట్టి నాలుగేళ్ళ పాటు స్నేహం నెరిపారు అని 2014 నుంచి 2018 వ్యవహారాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత ఇద్దరికీ చెడింది కాబట్టే దూరం జరిగారు అని అంటున్నారు. ఇక 2024 ఎన్నికల ముందు మళ్ళీ మోడీ బాబు కలిశారు అని అంటున్నారు. ఇలా హాట్ లైన్ లో మోడీతో టచ్ లో తెలుగు నాట కీలక నేతలు అంతా ఉన్నారు కదా అని అంటున్నారు.
అదే స్ట్రాంగ్ లైన్ :
హాట్ లైన్ అని కొత్తగా ఎన్ని వచ్చినా ఒక్క లైన్ మాత్రం వెరీ బిజీ అని అంటున్నారు. అంతే కాదు ఆ లైన్ వెరీ స్ట్రాంగ్ అని కూడా చెబుతున్నారు. అదే మోడీతో తెలుగు నేతల హాట్ లైన్ అని అంటున్నారు. రాహుల్ తో ఎవరూ హాట్ లైన్ లో ఉండే చాన్సే లేదు అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే ఏపీ కానీ తెలంగాణా కానీ ముఖ్యమంత్రులు కానీ మాజీ సీఎంలు ఆనె మోడీతోనే టచ్ లో ఉండాల్సిందే అని అంటున్నారు. ఇదే అసలైన పొలిటికల్ ఈక్వేషన్ అని అంటున్నారు.
అలా కాకుండా ఏమైనా జరిగితే మాత్రం మ్యాటర్ సీరియస్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక జగన్ మీద, చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక కేసీఆర్ విషయంలో కేసులు ఇంకా లేకపోయినా పెట్టే చాన్స్ కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఉంటుంది అని అంటున్నారు అందువల్ల వీరంతా రాహుల్ తో హాట్ లైన్ లో ఉంటే ఎలా కుదురుతుంది అని అంటున్నారు. అందువల్ల రాహుల్ తో తెలుగు నాట రాజకీయ నేతలు ఎవరూ హాట్ లైన్ లో ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ మాత్రం బాబుని రాహుల్ ని కలిపేశారు. కానీ లోగుట్టు చూస్తే అలా జరిగేది చాలా చాలా తక్కువ అని అంటున్నారు.