జగన్ డార్క్ రూమ్‌లో ఉంటారా?.. సంచలన చర్చ!
వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై తాజాగా మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై తాజాగా మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డార్క్ రూమ్‌లో ఉంటారని చెప్పారు. అయితే.. ఇది నిజమేనని గతంలోనూ కొందరు చెప్పుకొచ్చారు. వాస్తవానికి నాయకుడు అన్న వాడు.. డార్క్‌రూమ్‌లో ఉండమేంటి? అనేది ఆసక్తికర విషయం. కానీ. మంత్రి చెప్పిన దాని ప్రకారం.. జగన్ వ్యవహారాలన్నీ డార్క్‌లోనే జరుగుతాయని టీడీపీ నాయకులు కూడా ఎద్దేవా చేస్తున్నారు.
ఆయన ఇచ్చి పుచ్చుకునేవి మూడోకంటికి తెలియకుండానే చేస్తారన్న వాదన చేస్తున్నారు. గతంలో జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. అప్పట్లోనూ కప్పం కట్టమని.. తమను సాయిరెడ్డి అడిగిన విషయాన్ని దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మా నాయకుడికి కప్పం కట్టండి మీకు మంచి పొజిషన్ ఇస్తామని ఆయన ఆఫర్ ఇచ్చిన విషయాన్ని దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, ఉత్తరాదికి చెందిన నత్వానీ వచ్చినప్పుడు.. రాజ్యసభ సీటు అడిగినప్పుడుకూడా.. ఇలానే అంతర్గత చర్చలు నడిచాయి అని పెద్ద ప్రచారం నడిచింది .
ఆ తర్వాత.. జగనకు చెందిన సంస్థల్లో ఆదాయం పుంజుకుంది. ఇది ఎలా సాధ్యమైందన్న చంద్రబాబు ప్రశ్నకు వైసీపీ నాయకులు ఎదురు దాడిచేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి.. వైసీపీలోచేరి ఎమ్మెల్సీ సీటును పొందిన తూర్పు గోదావరి కి చెందిన మాజీ ఎంపీ కూడా.. ఇలానే డార్క్ రూమ్‌లోకి వెళ్లానంటూ.. ఒక సందర్భంగా చెప్పుకొచ్చారు.దీనిని బట్టి.. జగన్ డార్క్ రూమ్ ఏదో మెయింటెన్ చేస్తున్నట్టు టీడీపీ ప్రచారం చేస్తుంది . తాజాగా మంత్రి సుభాష్ కూడా ఈ విషయాన్ని వెల్లడించండంతో నిజమేనని తెలుస్తోంది.
సహజంగా పార్టీల అధినేతలు అంతర్గత చర్చలు జరుపుతారు. ఆ సమయంలో మీడియాలేకుండా.. కొంత మంది తమకు అనుకూల నాయకులను పెట్టుకుని చర్చలు ముగిస్తారు. కానీ, జగన్ ఈ విషయంలో భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నారన్న వాదన పార్టీలోనూ తరచుగా వినిపిస్తుంది. తనవద్దకు వచ్చే ఎమ్మెల్యేలనుకూడా ఫోన్లను అనుమతించరు. చివరకు తన మిత్రులు వచ్చినా.. చెక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. మంత్రిచెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదని టీడీపీ వారు అంటున్నారు.