జగన్ అసెంబ్లీకి వస్తే జరిగేది అదేనా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడచాయి.;
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడచాయి. ఈ మధ్యలో ఎన్నో సార్లు అసెంబ్లీ సమావేశం జరిగింది. జగన్ అయితే బడ్జెట్ సెషన్ తప్ప మరో దానికి వెళ్ళలేదు అసెంబ్లీకి వెళ్ళాలీ అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తనకు హోదా ఇవ్వాలని ఆయన కోరుకున్నారు దీని మీద కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే ఇంతలో ఎంత మార్పు అన్నట్లుగా జగన్ అసెంబ్లీకి వస్తున్నారు అన్న ప్రచారం మొదలైంది.
అదే జరిగితే టీఆర్పీ రేటింగ్ అదుర్స్ :
జగన్ కనుక అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వానికి ఎదురు నిలిస్తే ఆ వైపు ఏకమొత్తంగా ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు విరుచుకుపడితే ఆ సన్నివేశమే ఊహించుకోవడానికే ఆసక్తిగా ఉంటుంది. జగన్ వర్సెస్ చంద్రబాబుని అంతా చూశారు. మరోసారి చూడబోతారు. అలాగే పవన్ జగన్ ఎపుడూ ఫేస్ టూ ఫేస్ కాలేదు కానీ అది ఈసారి జరగబోతుంది. అదే విధంగా లోకేష్ తోనూ జగన్ ముఖాముఖీ తలపడలేదు. ఇలా చాలా అరుదైన సన్నివేశాలు అసెంబ్లీ సెషన్ లో ఉండబోతాయని అంటున్నారు.
అందరి కోరిక మేరకేనా :
జగన్ గత ఏడాది రాలేదు, ఇపుడు రావాలని అనుకుంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఎందుకు ఆయన వస్తున్నారు. దాని వెనక వ్యూహాలు ఏమిటి అంటే చాలానే అని అంటున్నారు. ఏపీ జనాలు అంతా జగన్ అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే వైసీపీలో కూడా మెజారిటీ అలాగే అంటున్నారు. దాంతో జగన్ అసెంబ్లీకి వస్తే అక్కడ సీన్ ఎలా ఉంటుంది ఏమిటి వారికి కూడా కళ్ళకు కట్టినట్లుగా అర్ధమయ్యేలా చూపించబోతున్నారు అని అంటున్నారు. తనకు మైక్ ఎంత వరకూ ఇస్తారో తనకు ఏ విధంగా అసెంబ్లీలో స్పేస్ ఉండబోతోందో ఆయన స్వయాన లోకానికి చూపించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
పాయింట్లు చాలానేనట :
ఇక కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో తొలి ఏడాది దాదాపుగా హానీమూన్ గడిపింది. ఆ సమయంలో అసెంబ్లీలో విపక్షంగా వెళ్ళినా ఖాతరు చేయరన్న భావన ఉంది. ఇపుడు రెండవ ఏడాది వచ్చింది. మెల్లగా అసంతృప్తి అంతటా పాకుతోంది. పైగా జగన్ ఓడినా జనాలు బాగా వస్తున్నారు దాంతో తనకు జనబలం ఉందని ఇప్పటికే కూటమికి చూపించిన జగన్ ఇపుడు తన బలంతోనే అసెంబ్లీకి వస్తున్నారు అని అంటున్నారు. ఈ సమయంలో కూడా విపక్షం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా మైక్ ఇవ్వకుండా చేస్తే కనుక తప్పు కూటమి వైపే ఉంటుందని అంటున్నారు. ఇక విపక్షం అడిగేందుకు చాలా పాయింట్లే ఉన్నాయని అంటున్నారు.
అల్టిమేట్ గా దాని కోసమేనా :
అసెంబ్లీలో విపక్షంలో జగన్ ని ఒక్కడిని చేసి అధికార పక్షం కనుక జోరు చేస్తే సింపతీ అన్నది బాగా వస్తుందని ఊహిస్తున్నారుట. అసెంబ్లీకి ప్రజా సమస్యల మీద వస్తే తనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ జనంలోకి వెళ్తే ఆ ఇంపాక్ట్ చాలానే ఉంటుంది అని అంటున్నారు. ఒక విధంగా పాదయాత్రకు అంతా ఎపుడో రెడీ చేసుకున్న జగన్ ఈ అసెంబ్లీ సెషన్ లో బాగుంటే మరిన్ని మీటింగ్స్ కి వెళ్తారు అని అంటున్నారు. లేకపోతే స్వస్తి చెప్పి తన మాటే నిజమని చెబుతారని ఇక జనాలకు పార్టీ జనాలకు కూడా ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదని అడిగేందుకు వీలు ఉండదని అంటున్నారు. మొత్తంగా వూహాత్మకంగానే జగన్ అసెంబ్లీకి వస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.