'ఆపరేషన్ రైజింగ్ లయన్'... ఇరాన్ హృదయంపై ఇజ్రాయెల్ భీకర దాడి!

పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ఏ క్షణం ఏమి జరగబోతోందనే టెన్షన్స్ నడుమ ఇరాన్ కు ఇజ్రాయేల్ ఊహించని రీతిలో వరుస షాకులిచ్చింది.;

Update: 2025-06-13 04:49 GMT

పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ఏ క్షణం ఏమి జరగబోతోందనే టెన్షన్స్ నడుమ ఇరాన్ కు ఇజ్రాయేల్ ఊహించని రీతిలో వరుస షాకులిచ్చింది. దీంతో... పశ్చిమాసియాలో నెక్స్ట్ ఏమి జరగబోతుందనేది తీవ్ర టెన్షన్ గా మారింది. మరోవైపు... ఈ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా చెబుతోంది. ఈ క్రమంలో.. అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్...!

అవును... పశ్చిమాసియా మళ్లీ అత్యంత ప్రమాదకర స్థాయిలో రగులుతోంది. తాజాగా ఇరాన్ అణుకర్మాగారం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. దాడులు చేయవద్దని ఆమెరికా వారించినా.. ఇజ్రాయెల్ దాన్ని పెడచెవిన పెట్టి మరీ అణుకర్మాగారం లక్ష్యంగా విరుచుకుపడటం గమనార్హం. ఈ సందర్భంగా జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలా ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడటంతో ఈ దాడుల్లో ఆ దేశానికి ఊహించని షాక్ తగిలింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ స్పందించారు. ఇందులో భాగంగా.. ప్రతిచర్యకు మరో సందర్భం కోసం ఎదురుచూడలేమని.. ఇక సమయం వచ్చిందని.. మాకు మరో అవకాశం లేకుండా పోయిందని.. మమ్మల్ని నాశనం చేయాలనుకునే వారి ముందు తాము తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ దాడులపై అమెరికా స్పందించింది. ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని తెలిపింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చర్యలు ప్రారంభించిందని తెలిపింది. ఈ దాడుల నేపథ్యలో ఇరాన్ కు ఒకటి చెప్పాలనుకున్నామంటూ.. అమెరికా ప్రయోజనాలకు గానీ, తమ సిబ్బందిని గాని లక్ష్యంగా చేసుకోకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి రుబియో తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు... ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆ దేశ అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని ప్రకటించారు.

Tags:    

Similar News