ఇరాన్ లో భారత్ 'ఆపరేషన్ గంగా' ఎందుకు ప్రారంభం కాలేదు?

అయితే... ఇరాన్ విషయంలో అలాంటి ఆపరేషన్స్ ఏమీ భారత్ చేపట్టలేదు. దీనికి భౌగోళిక రాజకీయాలు అడ్డుగా ఉన్నాయని అంటున్నారు.;

Update: 2025-06-18 15:30 GMT

ప్రస్తుతం పశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. అవిరామంగా ఇజ్రాయెల్, ఇరాన్ లు ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఇరాన్ గగనతలం మూసివేయబడింది.. పశ్చిమాసియాలో విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో.. అక్కడున్న సుమారు 10,000 మంది భారతీయుల తరలింపుపై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

అవును... 2022లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత్ వేగంగా స్పందించింది. ఇందులో భాగంగా.. "ఆపరేషన్ గంగా"ను ప్రారంభించింది. దీని ద్వారా వేలాది మంది పౌరులను, విద్యార్థులను ఆ ప్రాంతం నుంచి తరలించింది. అయితే... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ కి చేరుకుంటున్న వేళ.. ఇరాన్ నుంచి తరలించే విషయంలో ఇలాంటి ఆపరేషన్ చెపట్టలేదు.

ఇరాన్ లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు.. 6,000 మందికిపైగా అక్కద నివసిస్తున్నవారు.. వీరితో పాటు భారత నావికాదళం, షిప్పింగ్ సంబంధిత కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు ఉన్నారని అంటున్నారు. వీరిలో తాజాగా 110 మందిని తొలి విడతలో రోడ్డు మార్గం ద్వారా తరలించారు!

అయితే... 2022 ఫిబ్రవరి - మార్చి మధ్యలో సుమారు 22,500 మంది భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి భారత్ తీసుకొచ్చారు! ఆ సమయంలో ఆపరేషన్ గంగా కింద సుమారు 90 విమానాలు నడిపింది భారత్. అయితే.. అప్పుడు హంగేరీ, మోల్డోవా, రొమేనియా, పోలాండ్ వంటి ప్రాంతాల నుంచి తరలింపు విమానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచిన పరిస్థితి.

అయితే... ఇరాన్ విషయంలో అలాంటి ఆపరేషన్స్ ఏమీ భారత్ చేపట్టలేదు. దీనికి భౌగోళిక రాజకీయాలు అడ్డుగా ఉన్నాయని అంటున్నారు. తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న భారతీయుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. అందుకు అవసరమైన, అందుబాటులో ఉన్న తరలింపు మార్గాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి.

వీటిలో ఇరాన్ తూర్పు పొరుగుదేశాలైన పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ ల ద్వారా తరలింపు అనేది లాజిస్టికల్ సవాలు మాత్రమే కాదు.. భౌగోళికంగా కూడా తాజా పరిస్థితుల్లో చాలా కష్టం. పైగా.. పాక్ వైమానిక ప్రాంతం భారత్ కు మూసివేయబడి ఉంది.. ఇక, భూమార్గం ప్రశ్నే లేదు! ఆఫ్గన్ తో భారత్ సంబంధాలు మెరుగుపడినప్పటికీ.. లాజిస్టిక్ సవాల్ అలాగే ఉన్న పరిస్థితి!

ఇంకా ఇరాన్.. అర్మేనియ, అజర్ బైజాన్, తుర్క్ మెనిస్తాన్ లతోనూ భూ సరిహద్దులను పంచుకుంటుంది. అయితే... ఇటీవల పాకిస్థాన్ కు అజర్ బైజాన్ మద్దతుగా నిలిచింది. సో.. ఆ ఆప్షన్ లేదు! ఇక తుర్క్ మెనిస్తాన్ ఇప్పటికీ భారత్ కు ఒక ఎంపికగానే ఉండటంతో.. నెక్స్ట్ బ్యాచ్ ను అటు నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది.

కాగా... ఇరాన్ నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభమైన వేళ 110 మందితో కూడిన మొదటి బ్యాచ్ ను అర్మీనియం మీదుగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! ఈ సంక్షిష్ట పరిస్థితుల నేపథ్యలోనే ఈ తరలింపుకు భారత్ ఎలాంటి ఆపరేషన్ పేరు పెట్టలేదని అంటున్నారు!

Tags:    

Similar News