నిమిషా ప్రియకు ఉరి తప్పదా..? ఇంకా ఏఏ దేశాల్లో ఎంత మందికి ఉరి శిక్ష పడిందంటే?

యెమెన్ చట్టాల ప్రకారం అక్కడ ఏదైనా బిజినెస్ చేయాలంటే ఆ దేశ పౌరుల భాగస్వామ్యం ఉండాలి. ఇందులో భాగంగా ఆమె తలాల్ అబ్దో మెహదీని బిజినెస్ పార్ట్నర్ గా పెట్టుకుంది.;

Update: 2025-07-15 09:25 GMT

ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకడం కొంచెం కష్టమే. తెలివితో పాటు శ్రమను పణంగా పెట్టడంలో భారతీయులు వారికి వారే సాటి. అందుకే ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఇండియన్స్ ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ నుంచి లేబర్ వరకు భారతీయులపైనే కొన్ని దేశాలు ఆధారపడతాయి. ఈ విషయం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రమ శిక్షణలో కూడా మనవారు అందరి కంటే మెరుగే. అక్కడి పరిస్థితులు, చట్టాలు పూర్తిగా తెలియకపోయినా సాధారణ పౌరుడిగా ఉండేందుకే ప్రయత్నిస్తారు.

భారతీయుల్లో ఎక్కవ మంది ముస్లిం కంట్రీస్ కు వెళ్లడం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియా 2008లో వెళ్లింది. అక్కడ నర్సుగా పని చేస్తూ కాలం గడిపింది. వివాహం కోసం ఇండియాకు వచ్చి 2011లో భర్తను తీసుకొని మళ్లీ యెమెన్ వెళ్లింది. యెమెన్ అంతర్యుద్ధం కారణంగా 2014లో భర్త, కుమార్తెను ఇండియాకు పంపించింది. తాను మరికొంత డబ్బు సంపాదించి ఇండియాకు వచ్చి స్థిరపడతానని వారికి నచ్చజెప్పి పంపించి ఆమె అక్కడే ఉండిపోయింది.

యెమెన్ చట్టాల ప్రకారం అక్కడ ఏదైనా బిజినెస్ చేయాలంటే ఆ దేశ పౌరుల భాగస్వామ్యం ఉండాలి. ఇందులో భాగంగా ఆమె తలాల్ అబ్దో మెహదీని బిజినెస్ పార్ట్నర్ గా పెట్టుకుంది. కొంత కాలం వీరి బిజినెస్ బాగానే సాగింది. ఆ తర్వాత ఆమె ఇండియాకు వెళ్తానంటే మెహదీ ఒప్పుకోలేదుని, పాస్ పోర్ట్ తన వద్ద ఉంచుకొని ఇక్కడే ఉండాలని, తను చెప్పినట్లు వినాలని బలవంతం చేయడం మొదలు పెట్టాడు. చాలా సార్లు శారీరక, మానసిక వేధింపులకు కూడా గురి చేశాడని ఆత్మరక్షణలో భాగంగా అంతమొందించినట్లు ఆమె చెప్పుకచ్చింది. కానీ అక్కడి చట్టాలు ఆమెకు వెసులుబాటు కల్పించలేదు. కనీసం మానవతా దృష్టితో కూడా చూడలేదు. కోర్టు సీరియస్ గా తీసుకున్న అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. నిమిషా ప్రియా విషయంలో భారత్ తీవ్రంగా ప్రయత్నించింది. తన రాష్ట్ర పౌరురాలు కోసం ప్రధాని జోక్యం చేసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు. ఫారన్ ఎఫైర్ మినిస్టర్ జైశంకర్ కు కూడా వినతులు వెళ్లాయి. కానీ యెమెన్ కు భారత్ కు మధ్య పెద్దగా దృఢమైన సంబంధాలు లేకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు.

భారత ప్రభుత్వం ఆమెను కాపాడాలని చాలా వరకు ప్రయత్నించింది. మెహదీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. అయినా ససే మీరా అనకపోవడంతో ఈ నెల (జూలై) 16వ తేదీ ఆమెను ఉరి తీయనున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభలో తీవ్ర చర్చ జరిగింది. అసలు ఏఏ దేశంలో భారతీయులు ఎంత మంది శిక్షలు అనుభవిస్తున్నారో కేంద్రం డేటా రిలీజ్ చేసింది. 2025, మార్చి వరకు సైదీ అరేబియాలో 2633 మంది, యూఏఈలో 2518, నేపాల్ లో 1317, ఖతార్ 611, కువైట్ 387, మలేషియా 338, యూకే 288, పాకిస్తాన్ 266 ఉన్నారని వివరించింది. అయితే 2020 నుంచి 2024 వరకు 47 మందికి ఆయా దేశాల్లో ఉరిశిక్ష పడినట్లు లోక్ సభ తెలిపింది.

Tags:    

Similar News