ఈ దేశంలో ఆడాళ్లు అత్యాచారం చేసినా మ‌గాళ్ల‌కే శిక్ష‌?

ఇప్పుడు గెహానా వసిష్త్ పాడ్‌కాస్ట్ లోని ఓ వీడియో క్లిప్ సంచ‌ల‌నంగా మారింది. గెహ‌నా అతిథి ఒక మాట అన్నారు.;

Update: 2025-04-14 18:10 GMT

భార‌త‌దేశంలో చట్టాల‌పై చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి. మహిళా సింప‌థీ ముందు మగాళ్లు దిగ‌దుడుపే. అస‌లు మ‌గాడు ఆకులో వ‌క్క‌లా, కూర‌లో క‌రివేపాకులా న‌లిగిపోతున్నాడనేది చాలామంది అభిప్రాయం. మ‌హిళ‌ల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ చ‌ట్టాలు అంత బ‌లంగా ఉన్నాయి. మ‌గాళ్ల‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టాలను త‌యారు చేసార‌నేది అభియోగం.

ఇప్పుడు గెహానా వసిష్త్ పాడ్‌కాస్ట్ లోని ఓ వీడియో క్లిప్ సంచ‌ల‌నంగా మారింది. గెహ‌నా అతిథి ఒక మాట అన్నారు. త‌న భ‌ర్త‌కు అది ఇష్టం లేక‌పోయినా..బ‌ల‌వంతంగా ఆ ప‌నిలోకి దించిన‌ట్టు అంగీకరించాల్సి వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ కి తెర తీసింది.

ఈ క్లిప్ సారాంశం ఇలా ఉంది. ఆ మహిళ తన భర్త తనకు కావలసినప్పుడల్లా అత‌డ‌కి ఇష్టం ఉన్నా లేక‌పోయినా అత‌డిని `ఉపయోగించుకుంటానని` చెబుతుంది. ఆ స్వ‌రం లైట్ గా ఉన్నా కానీ, ఆమె క‌ఠోర‌మైన‌ద‌ని నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనిని వైవాహిక అత్యాచారం అని ఆవేద‌న చెందుతున్నారు. ఒక పురుషుడు అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉంటే మ‌హిళ‌లు జైల్లో పెట్టించేవారు! పెళ్ల‌యితే మ‌గాడు భ‌రించాల్సిందే.. ఇది చాలా అన్యాయం అని ఇది నిరూపిస్తోంది. భార‌త‌దేశంలో చ‌ట్ట‌ప‌ర‌మైన లొసుగును ఇది బ‌య‌ట‌పెడుతోంది.

భాగస్వామి కూడా భార్య‌పై మ‌న‌సు ప‌డ‌కూడ‌ద‌ని చ‌ట్టం ప‌రోక్షంగా చెబుతుంది. పురుషులను లైంగిక వేధింపుల నుండి రక్షించే చట్టాలు దేశంలో లేవు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 375 అత్యాచారం చేసిన పురుషుడిని లోన వేయ‌డ‌మే ధ్యేయం. అదే స‌మ‌గాడు అత్యాచారానికి గురైనా కానీ దానిని చ‌ట్టాలు అస్స‌లు ప‌ట్టించుకోవు. దీని అర్థం ఎవరైనా లైంగిక వేధింపులకు గురైన పురుషులకు చట్టపరమైన సహాయం లేదు. ముఖ్యంగా పెళ్ల‌య్యాక భ‌ర్త భార్య‌ను కోరినా అది నేరం. చ‌ట్ట‌ప‌రంగా ఆడాళ్ల‌కు ఉన్న వెసులుబాటు పురుషుల‌కు అస‌లు లేదు. తాజా ఈవెంట్లో లేడీ వాయిస్ విన్న త‌ర్వాత చట్టం గురించి చాలా ఆలోచించాలి.

Tags:    

Similar News