అట్టారి కాకుండా ఇండియా, పాక్ లను కలిపే సరిహద్దు ఏది.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ?

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ పై పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.;

Update: 2025-04-24 07:55 GMT

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ పై పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సీసీఎస్ సమావేశం అనంతరం పాకిస్తాన్‌పై ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అటారీ-వాఘా సరిహద్దును పూర్తిగా మూసేయాలని ప్రభుత్వం ఆదేశాల జారీ చేసింది. ఈ సరిహద్దులో జరిగే బీటింగ్ ది రిట్రీట్ వేడుకను కూడా నిలిపేసింది. అంతేకాకుండా, భారత్, పాక్ సరిహద్దులు కలిసే రాష్ట్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అసలు పాకిస్తాన్ సరిహద్దు ఏయే రాష్ట్రాలతో కలుస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత్-పాకిస్తాన్ సరిహద్దును అంతర్జాతీయ సరిహద్దు అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుంచి భారతదేశంలోని గుజరాత్, పాక్ లోని సింధ్ ప్రావిన్స్‌లోని జీరో పాయింట్ వరకు విస్తరించి ఉంది. భారత్ , పాక్ సరిహద్దు మొత్తం పొడవు 3323 కిలోమీటర్లు. పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రాలు జమ్మూ-కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. ప్రస్తుతం ఆ సరిహద్దుల వద్ద పరిస్థితి కాస్త ఉధృతంగా ఉంది.

రాజస్థాన్ సరిహద్దు

రాజస్థాన్ 1035 కిలోమీటర్ల సరిహద్దు పాక్ తో కలుస్తుంది. రాజస్థాన్‌లోని నాలుగు జిల్లాలు - బార్మర్, జైసల్మేర్, గంగానగర్, బికనీర్ పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ సరిహద్దులో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజస్థాన్‌లో ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో సరిహద్దు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాక్ సరిహద్దును కలిసే అన్ని ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.


గుజరాత్ సరిహద్దు

గుజరాత్ 512 కిలోమీటర్ల సరిహద్దు పాకిస్తాన్‌ తో ఉంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో 508 కిలోమీటర్ల సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఇది పాకిస్తాన్ చుట్టూ ఉంది. ఈ సరిహద్దులో కూడా సైన్యాన్ని అప్రమత్తం చేశారు.


పంజాబ్ సరిహద్దు

పాకిస్తాన్ సరిహద్దుతో పంజాబ్ 547 కిలోమీటర్ల సరిమద్దును కలిగి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఆరు సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. వాటిలో అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, తరన్‌తారన్, ఫాజిల్కా, గుర్దాస్‌పూర్ ఉన్నాయి. ఇక్కడ కూడా పోలీసులు, బీఎస్‌ఎఫ్ అప్రమత్తం అయింది. సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు.


లడఖ్, జమ్మూ కాశ్మీర్

ఈ రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటాయి. ఇక్కడ భారత్-పాకిస్తాన్ అతి పొడవైన సరిహద్దు ఉంది, దీని పొడవు 1216 కిలోమీటర్లు. జమ్మూలోని పూంచ్, రాజౌరి జిల్లాల నుండి భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉంది. దీనినే లైన్ ఆఫ్ కంట్రోల్(LOC) అని అంటారు. ఇక సైన్యం ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ-కాశ్మీర్‌లోని అనేక హైవేలను కూడా మూసివేశారు.


Tags:    

Similar News