• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ కు బిగ్ షాక్......

పాక్ కు బిగ్ షాక్... దాయాదీ ప్రయత్నాలను గాల్లో కలిపేసిన భారత్!

| సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడానికి పాకిస్థాన్ గురువారం వరుస ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-08 17:12 GMT

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడానికి పాకిస్థాన్ గురువారం వరుస ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 15 నగరాల్లోని సైనిక స్థావరలే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే.. ఆ ప్రయత్నాన్ని భారత్ బలంగా తిప్పికొట్టింది. ఈ సమయంలో గురువారం రాత్రి జమ్మూ లక్ష్యంగా పాక్ మరోసారి డ్రోన్లను ప్రయోగించింది!

అవును... భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించినట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ప్రధానంగా జమూలోని ఓ ఎయిర్ స్ట్రిప్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.

మరోవైపు సాంబ జిల్లాలో పాకిస్థాన్ రేంజర్లు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్లు కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల సైరన్ శబ్ధాలు వినిపిస్తున్నాయి! ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలంతా బ్లాక్ అవుట్ పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది!

ఈ సందర్భంగా.. జమ్మూ సివిల్ ఎయిర్ పోర్ట్, ఆర్.ఎస్.పురా, ఆర్నియా, సాంబా, పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ నుంచి సుమారు ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే... ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకొందని సమాచారం.

ఇదే సమయంలో... పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ ని భారత్ చాకచక్యంగా కూల్చివేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దగ్గర భారీ పేలుడు శబ్ధం వినిపించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో... పాక్ కి చెందిన జేఎఫ్-17 ఫైటర్స్ జెట్స్ రెండింటిని భారత్ కూల్చివేసినట్లు తెలుస్తోంది.

అయితే... భారత సైన్యం వేగవంతమైన, నిర్మాణాత్మకమైన చర్య వల్ల తాజా పాక్ ప్రయత్నం కారణంగా ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అంటున్నారు. దీంతో... భారత్ – పాక్ మధ్య ఈ దాడి ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

Tags:    
  • IndiaPakistanTensions 
  • JammuAttack 
  • S400Defense 
  • BorderSecurity 
  • IndianArmy 
  • F16Down 
  • DroneStrike 
  • IndiaDefends 
  • SurgicalDefense 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS