మరో పహెల్గామ్ దాడి.. భారత్ కు లష్కరే తోయిబా హెచ్చరిక..

పహెల్గామ్ దాడిని భారత్ మరువదు.. అలాగని పాకిస్తాన్ కూడా మరువలేదు. ఈ దాడికి నిరసనగా ఇండియా పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించి ఆ దేశంపై యుద్ధం చేసింది.;

Update: 2025-10-08 10:17 GMT

పహెల్గామ్ దాడిని భారత్ మరువదు.. అలాగని పాకిస్తాన్ కూడా మరువలేదు. ఈ దాడికి నిరసనగా ఇండియా పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించి ఆ దేశంపై యుద్ధం చేసింది. కేవలం కొన్ని రోజులే సాగిన ఈ యుద్ధంతో పాక్ తీవ్రంగా నష్టపోయింది. తాగు, సాగునీటిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బాంబుల వల్ల కలిగే నష్టంతో పాటు దీర్ఘకాలికంగా సాగు నీటి కొరతతో నష్టపోవాల్సిందే. ఆపరేషన్ సింధూర్ దీర్ఘకాలికంగా కొనసాగుతుందని టెర్రరిజమ్ అంతం అయ్యే వరకు సింధూర్ కు ముగింపు ఉండదని భారత్ తేల్చి చెప్పింది.

లష్కరే తోయిబా మరో వార్నింగ్..

పహెల్గాం ఉగ్రదాడి సూత్రదారి, పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మరోసారి భారత్ ను బెదరించే ప్రయత్నం చేశారు. మరోసారి పహెల్గాం లాంటి దాడి జరుగుతుందని ఇది మోడీకి వార్నింగ్ అంటూ వ్యాఖ్యానించారు. భారత్ వాటర్ టెర్రరిజం కు పాల్పడుతుందని, ఉద్దేశ్యపూర్వకంగా నీటి కరువు, వరదలు వచ్చేలా చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం భౌగోళిక సమస్య కాదు.. దేశీయ, సరిహద్దు రాజకీయాలకు పెను సవాలు. పహెల్గాం ప్రాంతం ఇప్పటికే భద్రతా పరంగా తీవ్రమైన సంక్లిష్టతను ఎదుర్కొంటోంది, ఇలాంటి హెచ్చరికలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తాయి.

ప్రపంచ పటంలో ఉంచం..

భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోదు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానికులు, భద్రతా సిబ్బంది, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరిస్తోంది. మరోసారి దాడి జరిగితే పాక్ కే తీవ్ర నష్టం. భారత్ వాటర్ ట్రీటీపై మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్తోంది. పాక్ తన వైఖరి మార్చుకోకుంటే ప్రపంచ పటంలో ఉండదని భారత ఆర్మీ హెచ్చరిస్తోంది. ఇటీవల భారత ఆర్మీ చీఫ్ అధికారి పాక్ కవ్వింపు చర్యలపై మాట్లాడారు. పాక్ చేస్తున్న వ్యవహారాలను గమనిస్తున్నామని, పద్ధతి మార్చుకోకుంటే కరాచీని ఇండియాలో కలిపేస్తామని, అందుకు మాకు రోజుల సమయం కూడా పట్టదన్నారు.

Tags:    

Similar News