జల వివాదాలు కాదు.. జల జాగ్రత్తలు ముఖ్యం!
అయితే.. ఈ విషయానికి పరిష్కారం ఎప్పుడు? అనేది మాత్రం ఎడతెగని ప్రశ్నగానే మారింది. ఈ వ్యవహారం అటుకేంద్ర ప్రభుత్వానికి కూడా ఇరకాటంగా మారిపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యేకాదు.. దేశంలోని అనేక రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక-తమిళ నాడు, కేరళ-కర్ణాటక, మహారాష్ట్ర-తెలంగాణ, ఏపీ-తెలంగాణ, పంజాబ్-హరియాణ ఇలా.. ఏ రెండు సరిహద్దు రాష్ట్రాలను తీసుకు న్నా.. జల వివాదాలు కనిపిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ వివాదాలు కొనసా గుతున్నాయి. అయితే.. ఈ విషయానికి పరిష్కారం ఎప్పుడు? అనేది మాత్రం ఎడతెగని ప్రశ్నగానే మారింది. ఈ వ్యవహారం అటుకేంద్ర ప్రభుత్వానికి కూడా ఇరకాటంగా మారిపోయింది.
జాతీయ స్తాయిలో జల వివాదాలు పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఉన్నా.. అవార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీలు ఉన్నా.. పరిష్కారం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయంపై తాజాగా అటు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటు సీఎం చంద్రబాబుకూడా ఒకే రోజు వేర్వేరు చోట్ల ప్రస్తావించారు. `జల వివాదాలు కాదు.. జల జాగ్రత్తలు ముఖ్యం`` అని ఇరువురు తేల్చి చెప్పారు. పంతానికి పోతున్న రాష్ట్రాలు జలాలను వృథాగా సముద్రంలో కలిసిపోయినా ఇష్టపడుతున్నాయని.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదన్నది ఇరువురు నేతల ఆవేదన.
ఢిల్లీలో జరిగిన రెండు రోజుల తొలి జలసదస్సు ముగింపు సందర్భంగా అటు ప్రధాని.. ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని మళ్లించే సందర్భంగా ఇటు సీఎం చంద్రబాబు.. ఇదే విషయాన్ని చెప్పుకొని రావడం గమనార్హం. ఇరువురు నేతల అభిప్రాయాలు ఒక్కటే.. సమర్థవంతమైన జల వినియోగం.. జల సంరక్షణ చర్యలతోపాటు.. నదుల అనుసంధానం. ఈ విషయాలు పాటిస్తేనే దేశంలో కరువు పీడిత ప్రభావిత జిల్లాలకు న్యాయం జరుగుతుందన్నది వారి వాదన. ఇప్పటికే నదుల అనుసంధాన మంత్రాన్ని సీఎంచంద్రబాబు పఠిస్తున్నారు. ప్రధాని ఈ విషయాన్ని సాధించగలరని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం రెండింట మూడు వంతులు..
ప్రస్తుతం దేశంలోని రెంటిండ మూడు వంతుల జనాభాకు(వందలో 30 మంది) సరైన తాగునీరు లేదన్నది వాస్తవం. అంతేకా దు.. 43 శాతం భూములకు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందిస్తున్నారు. ఈ పరిణామాలతోనే కరువు రక్కసి వెంటాడుతోం ది. దీనికి తోడు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం కూడా మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని సమూలంగా మార్చాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. దీనికి ముందుకు వచ్చే రాష్ట్రాలను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇదే విషయాన్ని అటుప్రధాని కూడా ప్రస్తావించడం గమనార్హం. సో.. మొత్తంగా జల వివాదాల కంటే కూడా జల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్నినొక్కిచెబుతున్నారు.