'క్రెడిట్' కలిసి రావట్లేదు.. కింకర్తవ్యం..?
క్రెడిట్ చోరీ వ్యవహారం.. వైసీపీకి ఏమేరకు కలిసి వస్తోందన్నది ప్రశ్న. వైసీపీ నాయకులే చెబుతున్నట్టుగా.. ఈ పాలి టిక్స్ పెద్దగా వర్కవుట్‌కావడం లేదు.
క్రెడిట్ చోరీ.. అంటూ వైసీపీ చేస్తున్న రాజకీయాలపై విమర్శలు పెల్లుబుకుతున్నాయి. గతంలో తాము చేసిన పను లను టీడీపీ తన పేరు జోడించుకుని ప్రచారం చేస్తోందని.. వాస్తవానికి ఆ క్రెడిట్ అంతా తమదేనని వైసీపీ నాయకు లు చెబుతున్నారు. అధినేత జగన్ కూడా తాడేపల్లి ప్రెస్‌మీట్లలో ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే.. పార్టీ పరంగా ఎలా ఉన్నప్పటికీ ఈ వ్యవహారం మాత్రం ప్రజల్లో పెద్దగా కలిసి రావడం లేదు. ప్రజలు చర్చించుకోవడం కూడా లేదు. పైగా.. ఇది మైనస్ అవుతోందన్న వాదనా వినిపిస్తోంది.
ఇవి సహజం..
వైసీపీ చెబుతున్న క్రెడిట్ చోరీ వ్యాఖ్యలు, కామెంట్లను ప్రజలు లైట్ తీసుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు వ్యాఖ్యానించారు. ``మేం చెబుతున్నా.. ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ఏం చేస్తాం`` అని తనదైన బాణీలోనే చెబుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. చేసినవి అప్పుడే చెప్పుకొంటే బాగుండేదని.. ఇప్పుడు అరిచి గీపెట్టినా ఎవరు మాత్రం వింటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ప్రజలు కూడా వీటిని సహజ రాజకీయాలుగానే చూస్తున్నారని అన్నారు.
కట్ చేస్తే..
క్రెడిట్ చోరీ వ్యవహారం.. వైసీపీకి ఏమేరకు కలిసి వస్తోందన్నది ప్రశ్న. వైసీపీ నాయకులే చెబుతున్నట్టుగా.. ఈ పాలి టిక్స్ పెద్దగా వర్కవుట్‌కావడం లేదు. జగన్ ప్రెస్‌మీట్లను వీక్షిస్తున్న నెటిజన్లు కింద చేస్తున్న కామెంట్లను పరిశీలి స్తే.. క్రెడిట్ విమర్శలపై వారు ఏమంటున్నారోతెలుస్తుంది. ఈ విషయాలను పార్టీ ప్రామాణికంగా తీసుకోవాలి. మెజా రిటీ ప్రజలు యూట్యూబ్ వీడియోల కింద చేసే కామెంట్లు.. ఇది అనవసర రగడ.. ప్రస్తుత సమస్యలపై స్పందించా లని చెబుతున్నారు. మరికొందరు అప్పుడే ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నలు సంధిస్తున్నారు.
సో.. మొత్తంగా.. వైసీపీ చేస్తున్నక్రెడిట్ రాజకీయం ఆ పార్టీకి క్రెడిట్ తీసుకురావడం లేదన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కరెంట్ టాపిక్స్.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు ప్రస్తావిస్తున్న విషయాలపై స్పందిస్తే.. బెటర్ అన్నది మెజారిటీ నాయకుల అభిప్రాయం కూడా. ఈ దిశగా అడుగులు వేస్తే.. అప్పుడు ఈ క్రెడిట్ కోసం పాకులాడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.