60 శాతం సంపద 1 శాతం వారి వద్దే.. బెర్న్ స్టయిన్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు..
దేశం ఎంత ముందుకెళ్తున్నా.. సాధారణ కూలి రేటులో మాత్రం పెద్దగా తేడా కనిపంచడం లేదు.;
దేశం ఆర్థికంగా వేగంగా ముందుకెళ్తుంది.. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022లో 7 శాతం వృద్ధితో యూకే (యునైటెడ్ కింగ్ డమ్)ను, తర్వాత జపాన్ ను దాటి ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచం మొత్తం నేడు భారత్ ఎదుగుదలను చూస్తున్నాయి. దాదాపు 70 సంవత్సరాలకు పైగా దేశం పది నుంచి 20వ స్థానం బయటనే ఉండేది. కానీ ఈ పదేళ్ల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వంలో స్కాంలు లేకపోవడం.. పారదర్శకమైన పాలనతో ప్రతి వ్యక్తి ఆర్థికంగా బలంగా తయారవుతున్నాడు. మరో ఐదేళ్లలో మూడో స్థానానికి వెళ్తుందని ప్రధాని కొన్ని సందర్భాల్లో చెప్పడం విశేషం.
పెద్దగా పెరగని సాధారణ వ్యక్తి ఆర్థిక స్థితి..
దేశం ఎంత ముందుకెళ్తున్నా.. సాధారణ కూలి రేటులో మాత్రం పెద్దగా తేడా కనిపంచడం లేదు. దీంతో బీదవారు బీదవారుగానే మిగిలిపోతూ.. కలిగిన వారు మరింత సంపద మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సోషల్ మీడియా సైతం విస్తృతం కావడంతో ఇంటి నుంచే ఉపాధి పొందేవారు కోకొళ్లలు ఉన్నారు. దీంతో టెక్నాలజీని నమ్ముకున్న వారి సంపాదన పెరుగుతున్నా.. టెక్నాలజీ తెలియని వారు మాత్ర రోజు కూలిపైనే ఆధారపడుతూ కొంత ఇబ్బంది పడక తప్పడం లేదు.
శ్రామికశక్తి ఎక్కువే..
ప్రపంచంలో భారత్ స్థానం పైకి ఎగబాకుతుంది. నేడు అమెరికా లాంటి అగ్రదేశాల అనిచివేత విధానాన్ని భారత్ తిప్పికొడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు భారత్ వైపు చూస్తున్నారు. జనాభాలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడంతో ఇక్కడ కార్మిక శక్తి ఎక్కువ. ఎక్కువ పని గంటలు కూడా కావడంలో ఉత్పత్తుల సృష్టికి భారత్ మంచి దేశంగా మారింది. దీంతో యాపిల్, టెస్లా వంటి ప్రపంచ అగ్రకంపెనీలు భారత్ వైపునకు చూస్తున్నాయి.
60 శాతం ధనం 1 శాతం వారి వద్దే..
ఇవన్నీ పక్కన పెడితే నేడు దేశ సంపదలో 60 శాతం కేవలం 1 శాతం చేతుల్లోనే ఉందని కొన్ని రిపోర్టులు చెప్తున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన బెర్న్‌స్టయిన్ (Bernstein) ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. భారత్ లో మొత్తం కుటుంబాల సంపద 19.6 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే అందులో 11.6 ట్రిలియన్ డాలర్లు కుబేరుల చేతిలోనే ఉందని బెర్న్‌స్టయిన్ తెలిపింది. ఇందులో 2.7 ట్రిలియన్ డాలర్లు మ్యూచివల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీస్, బ్యాంక్స్ లలో పెట్టుబడులుగా ఉన్నాయని పేర్కొంది. మిగిలిన 8.9 ట్రిలియన్ డాలర్ల సంపద రియల్ ఎస్టేట్, గోల్డ్, నగల రూపంలో ఉందని రిపోర్టు వెల్లడించింది.