బోర్డర్ గేమ్ ఛేంజర్... చైనాకు చెక్ పెట్టే భారత్ ప్లాన్ ఇదే!

ఈ సందర్భంగా... చైనా నిఘాకు గురయ్యే అవకాశం ఉన్న ప్రస్తుత డార్బుక్ - ష్యోక్ - డీబీఓ రహదారికి సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా ఉండేల.;

Update: 2025-07-25 01:30 GMT

అవసరానికి పైకి నవ్వుతున్నట్లు కనిపించినా.. భారత్ కు పాకిస్థాన్ కంటే పెద్ద శత్రువు చైనా అని చెబుతారు నిపుణులు! భారత్ ముందు పాకిస్థాన్ తోక జాడించడం వెనుక చైనా మోరల్ సపోర్ట్ ఉందని చెబుతారు! ఈ క్రమంలో... వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి సరిహద్దు మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశగా, చైనా నిఘా కళ్లకు చిక్కని రీతిలో భారత్ ఓ రహదారిని నిర్మిస్తుంది.

అవును... సముద్ర మట్టానికి సుమారు 17,000 అడుగుల ఎత్తులో భారత్ ఓ వ్యూహాత్మక రహదారిని నిర్మిస్తుంది. ఇందులో భాగంగా... లడఖ్‌ లోని వ్యూహాత్మక దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) సెక్టార్‌ కు ప్రత్యామ్నాయ మార్గం వచ్చే ఏడాది సిద్ధంగా ఉంటుంది. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన మధ్య 2020లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్ ఈ కొత్త రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసింది.

ఈ సందర్భంగా... చైనా నిఘాకు గురయ్యే అవకాశం ఉన్న ప్రస్తుత డార్బుక్ - ష్యోక్ - డీబీఓ రహదారికి సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా ఉండేల... ససోమా – ససేర్ లా – ససేర్ బ్రాంగ్సా - గప్షాన్ - డీబీఓ మీదుగా వెళ్లే 130 కి.మీ. పొడవైన కొత్త మార్గాన్ని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మిస్తుంది. ఇది లెహ్ నుంచి డీబీఓ వరకూ ఉన్న దూరాన్ని 78 కి.మీ. తగ్గిస్తుందని చెబుతున్నారు.

వాస్తవానికి లడఖ్‌ లోని వ్యూహాత్మక దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) సెక్టార్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్‌ స్ట్రిప్‌ ను 16,614 అడుగుల ఎత్తులో కలిగి ఉండగా.. ఇక్కడ తరచుగా చైనా.. భారత్ ను సవాల్ చేస్తుంటుంది. ఈ సమయంలో... భారీ వాహనాల కదలికను సులభతరం చేయడానికి బీఆర్ఓ ఈ కొత్త మార్గంలో 9 వంతెనలను 40 - 70 టన్నుల లోడ్ సామర్థ్యంతో అప్‌ గ్రేడ్ చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి.

సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం భారీ హిమపాతం, ఆక్సిజన్ కొరతకు గురవుతుందని చెబుతున్నారు. దీని వలన నిర్మాణ సమయం సంవత్సరానికి కేవలం 5-6 నెలలకే పరిమితం అవుతుందని అంటున్నారు. ఈ సమయంలో... నిర్మాణ కార్మికులకు సహాయం చేయడానికి బీఆర్ఓ.. ప్రత్యేక 'ఆక్సిజన్ కేఫ్‌' లను ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో ససోమా నుండి ససేర్ బ్రాంగ్సా వరకు అన్ని కనెక్టింగ్, బ్లాక్ టాపింగ్ పనులను బీఅర్ఓ పూర్తి చేసింది. ఇదే సమయంలో... ముర్గో, గప్షాన్ తూర్పున ఉన్న రహదారిలో 60-70 శాతం పనిని పూర్తి చేసింది. ఈ క్రమంలో... 2026 అక్టోబర్ - నవంబర్ నాటికి మొత్తం 130 కి.మీ. రహదారి సిద్ధంగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News