భారత్ కు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జట్లు.. ఏఎంసీఏ ప్రాజెక్టుతో అగ్రభాగాన దేశం..

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. వరల్డ్ ఎకానమీలో ఇప్పటికే నాలుగో స్థానంలో ఉన్న మనం త్వరలో మూడో స్థానానికి వెళ్లబోతున్నాం.;

Update: 2025-10-01 13:30 GMT

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. వరల్డ్ ఎకానమీలో ఇప్పటికే నాలుగో స్థానంలో ఉన్న మనం త్వరలో మూడో స్థానానికి వెళ్లబోతున్నాం. ఇక ప్రొడక్షన్ రంగంలో భారత్ ను మించిన దేశం నేడు ప్రపంచలో లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే వరల్డ్ దిగ్గజ కంపెనీలు భారత్ వైపునకు క్యూ కడుతున్నాయి. రక్షణ రంగ చర్యలు కూడా భారీగా తీసుకుంటుంది. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్‌డీఓ కలిసి అద్భుతమైన ప్రాజెక్టులు చేస్తోంది.

అన్ని కంపెనీల భాగస్వామ్యం..

భారత్ తన సైనిక సామర్థ్యాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాల సరసన నిలబడేందుకు భారత్ తన సొంత ఐదో తరం (ఫిఫ్త్ జనరేషన్) స్టెల్త్ ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేయాలని కలలు కంటోంది. ఈ కలను నిజం చేసుకునేందుకు డీఆర్‌డీఓ (DRDO) విభాగం ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EoI) జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ గడువు ముగిసిన ఈ ప్రాజెక్ట్‌కు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), లార్సెన్ & టూబ్రో (L&T), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), BEML వంటి ప్రధాన కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 15 వేల కోట్లకు సమానం, ఇది దేశ అత్యంత ప్రతిష్టాత్మక రక్షణ కలల్లో ఒకటిగా నిలవనుంది.

ప్రాజెక్టులో ప్రధాన కంపెనీలు..

హిందుస్తాన్ ఏరోనాటగిక్స్ లిమిటెడ్ భారతదేశపు అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీ గతంలో ఈ కంపెనీనే యుద్ధ విమానాల సరఫరాదారుగా కీలక పాత్ర పోషించింది. ఎల్ అండ్ టీ, బెల్ సంయుక్తంగా ఏఎంసీఏ నిర్మాణానికి బిడ్ దాఖలు చేశాయి. బీఈఎంఎల్, పలు ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యంగా, ఈ ప్రాజెక్ట్‌లో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ బిడ్లను ఇప్పుడు బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ చీఫ్ శివథాను పిళ్లై నేతృత్వంలోని కమిటీ పరిశీలించి, తుది నివేదికను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించనుంది.

ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు

ఎంపికైన కంపెనీ ఫైటర్ జెట్ అభివృద్ధిలో ప్రధాన భాగస్వామి పాత్రను పోషిస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది.

భారత వైమానిక దళం 2034-35 నాటికి మొదటి ఏఎంసీఏ స్క్వాడ్రన్‌ను పొందే అవకాశం ఉంది.

కనీసం 125 విమానాలు (సుమారు 7 స్క్వాడ్రన్లు) ఉత్పత్తి ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి చేస్తారు.

దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఈ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నారు.

ఏఎంసీఏ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు

ప్రస్తుతం ఐదో తరం స్టెల్త్ ఫైటర్లు అమెరికా (F-35), రష్యా (Su-57), చైనా (J-20) దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఏఎంసీఏ ద్వారా భారత్ కూడా ఈ అగ్ర దేశాల సరసన నిలబడాలని చూస్తోంది. ఈ జెట్‌లో స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, బహుళ పాత్ర ఆయుధ క్యారేజ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఇది భారత వైమానిక దళానికి కొత్త ఊపునిస్తుంది.

రక్షణ పరిశ్రమకు ప్రాముఖ్యత

ఏఎంసీఏ కేవలం యుద్ధ విమానాల ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. ఇది భారత రక్షణ పరిశ్రమకు కీలక మలుపు. దీర్ఘకాలికంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు పెద్ద ఆర్డర్లను ఉత్పత్తి చేస్తుంది. హై-టెక్నాలజీ భాగస్వామ్యాలు ఏర్పడడం, అంతరిక్ష పరిశ్రమను బలోపేతం చేయడం వంటి అవకాశాలను కలిగిస్తుంది.

భారత్ గ్లోబల్ అగ్రస్థానంలో

ఏఎంసీఏ ప్రాజెక్ట్ ద్వారా భారత్‌ ఒక దేశీయ సాంకేతికత ఆధారిత స్టెల్త్ ఫైటర్‌ను రూపొందిస్తూ, అగ్రదేశాల సరసన నిలబడే సామర్థ్యాన్ని సంపాదించుకుంటుంది. ఇది కేవలం సైనిక బలాన్ని మాత్రమే కాక.. దేశీయ పరిశ్రమలకు, ఉద్యోగ అవకాశాలకు, హై-టెక్ సాంకేతికతలో స్వావలంబనకు కూడా సాధిస్తుంది. ప్రాజెక్ట్ సాఫల్యం, భవిష్యత్తులో భారత వైమానిక దళానికి ఆధునిక సాంకేతికతను సమకూర్చే మార్గాన్ని సులభతరం చేస్తుంది.

Tags:    

Similar News