• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ మీద విషం చిమ్మితేనే ...

ఏపీ మీద విషం చిమ్మితేనే సీట్లొస్తాయా ?

| ఒకవైపు కేసీయార్ బహిరంగసభల్లో మాట్లాడుతుంటే మరోవైపు మంత్రులు కేటీయార్, హరీష్ రావులు నియోజకవర్గాల్లో రోడ్డుషోలు, చిన్నపాటి సభల్లో మాట్లాడుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-09 06:14 GMT

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు గెలవాలంటే ఏపీపై విషం చిమ్మాల్సిందేనా ? ప్రత్యేక తెలంగాణా ఏర్పడి పదేళ్ళవుతున్నా ఇంకా ఏపీ మీద విధ్వేషాన్ని నింపాల్సిందేనా ? ఇవన్నీ కేసీయార్ మాటలు విన్న తర్వాత జనాల్లో మెదులుతున్న ప్రశ్నలు. ఎన్నికల బహిరంగసభల్లో కేసీయార్ రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో మాట్లాడుతున్నారు. ఒకవైపు కేసీయార్ బహిరంగసభల్లో మాట్లాడుతుంటే మరోవైపు మంత్రులు కేటీయార్, హరీష్ రావులు నియోజకవర్గాల్లో రోడ్డుషోలు, చిన్నపాటి సభల్లో మాట్లాడుతున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీళ్ళ ముగ్గురి మాటల్లోను ఏపీ పైన విషం చిమ్మటమే కనబడుతోంది. ఏపీపైన తెలంగాణా జనాల్లో ఎంత విధ్వేషాన్ని నింపితే బీఆర్ఎస్ కు అన్ని ఓట్లు వస్తాయని, సీట్లు గెలుస్తామని అనుకుంటున్నారు. అందుకనే పదేపదే తెలంగాణా అద్భుతంగా అభివృద్ధి జరుగుతోందని, ఏపీలో అధ్వాన్న పాలన సాగుతోందని చెబుతున్నారు. డబుల్ రోడ్డుంటే తెలంగాణా అని సింగిల్ రోడ్డుంటే ఏపీ అని అర్ధమని కేసీయార్ ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీలో ఎవరూ తెలంగాణా గురించి మాట్లాడటంలేదు. కేసీయార్, మంత్రులు మాత్రమే ఏపీ గురించి పదేపదే అదీ అవమానకరంగా మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే జనాల్లో తెలంగాణా సెంటిమెంటును రాజేయటమే. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రస్తావిస్తే జనాలు నమ్మరని వీళ్ళకి అర్ధమవ్వబట్టే. రైతుబంధు, రుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధు పథకాలు ఎంత సవ్యంగా అమలవుతున్నాయో అందరికీ తెలుసు. కేసీయార్ అమలుచేస్తున్న చాలా పథకాలు పక్క రాష్ట్రాల నుండి కాపీ చేసినవే. అవికూడా సక్రమంగా అమలు కావటంలేదు.

ఇక అభివృద్ధి అంటే వర్షాలు పడినపుడు హైదరాబాద్ రోడ్లను చూస్తే చాలు తెలంగాణా అభివృద్ధి ఏమిటో తెలుస్తుంది. అభివృద్ధి, సంక్షేమపథకాలపై మాట్లాడితే జనాలు ఓట్లేయరనే మళ్ళీ సెంటిమెంటును రాజేస్తున్నారు. సెంటిమెంటును రాజేయాలంటే ఏపీ పై విషం చిమ్మాల్సిందే. అందుకనే అవసరంలేకపోయినా పదేపదే ఏపీని కించపరుస్తు మాట్లాడుతున్నది. రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళవుతున్నా ఇంకా ఏపీపైన విషం చిమ్ముతున్నారంటేనే కేసీయార్, మంత్రుల ఆలోచనలు ఏమిటో అర్ధమైపోతోంది.

Tags:    
  • Telanganaelections 
  • Brsparty 
  • Bjpparty 
  • Congressparty 
  • Kcr 
  • Ktr 
  • Harishrao 
  • Rythubandhu 
  • Dalitbandhu 
  • Bcbandhu 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS