ఉచిత బస్సులో ఆ గుర్తింపు కార్డు తీసుకెళ్తే !
తొలి రోజు అయితే ఏకంగా 12 లక్షల మంది దాకా మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు పధకాన్ని ఉపయోగించుకున్నారు.;
ఏపీలో రెండు రోజుల క్రితం ఉచిత బస్సు పథకం మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది. తొలి రోజు అయితే ఏకంగా 12 లక్షల మంది దాకా మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు పధకాన్ని ఉపయోగించుకున్నారు. ఈ పధకానికి అంతకంతకు ఆదరణ పెరుగుతుందని కూటమి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత బస్సులో ప్రయాణించేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే అని స్పష్టంగా అధికారులు పేర్కొంటున్నాయి.
వీటిలో ఏది అయినా ఓకే :
ఆధార్ కార్డు అలాగే ఓటరు కార్డు, అదే విధంగా రేషన్ కార్డు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయినా చూపిస్తే వాటిని గుర్తింపుగా కండక్టర్లు స్వీకరిస్తారు. ప్రస్తుతానికి అయితే వీటి ఒరిజినల్స్ నే బస్సులలో అడుగుతున్నారు. అయితే తొందరలోనే ఈ నిబంధనను సవరించి సాఫ్ట్ కాపీ చూపించినా ఓకే అన్న విధానం తీసుకుకుని రావాలని ప్రభుత్వం చూస్తోందని చెబుతున్నారు. అంటే ఫోన్ లో అయినా ఆధార్ కార్డు కానీ మరే గుర్తింపు కార్డు కానీ చూపించినా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు అన్న మాట.
అది మాత్రం కుదరదంతే :
అయితే కొందరు మాత్రం పాన్ కార్డుని కూడా గుర్తింపు కార్డుగా ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. కానీ అది వేరే వాటికి గుర్తింపు కార్డు అయితే ఉండొచ్చు కానీ ఉచిత బస్సు పధకానికి చెల్లదనే చెబుతున్నారు. ఎందుకు అంటే పాన్ కార్డులో ఇంటి చిరునామా ఉండదని అందుకే తిరస్కరిస్తున్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు అది తప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపుగా జారీ చేసే ఆ అధికారిక ధృవీకరణ పత్రంతో అయినా ప్రయాణం చేయవచ్చు అని అంటున్నారు. అంతే కాదు సీనియర్ సిటిజన్లకు జారీ చేసే గుర్తింపు కార్డులు కూడా చెల్లుతాయి. అంతే కాదు దివ్యాంగులు సైతం తమ గుర్తింపు కార్డు చూపిస్తే ఉచిత బస్సులో ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
వారంతా ఫుల్ హ్యాపీ :
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం చాలా సెక్షన్లకు ఫుల్ హ్యాపీగా ఉంది అని ఫీడ్ బ్యాక్ వస్తోంది. కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, అలాగే వివిధ ఆఫీసులలో ఇతర కార్యాలయాలలో తెల్లారి లేస్తే బస్సుల వెంట పడే చిరుద్యోగ మహిళలకు ఎంతో ఆననంగా ఉందని అంటున్నారు. వీరంతా ప్రతీ నెలా పాసులు తీసుకుంటున్నారు. దాని వల్ల కనీసంగా పదిహేను వందల దాకా ఖర్చు అవుతోంది. ఇపుడు ఆ సొమ్ము మిగిలినట్లే అని వారు ఆనందిస్తున్నారు. అలాగే తమ పల్లెల నుంచి పట్టణానికి వివిధ వ్యాపారాల కోసం బస్సులు ఎక్కే గ్రామీణ మహిళలకు సైతం ఈ పధకం చాలా ఉపయోగంగా ఉంటోంది. కూలీ నాలీ పనులకు వెళ్ళే వారు కూడా ఉచిత బస్సులల్లో తాము ఎక్కడికి వెళ్ళాలో అంతవరకూ వెళ్ళేందుకు వీలు కలుగుతోంది. ఒవరాల్ గా చెప్పాలీ అంటే కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ ఉచిత బస్సు పధకం విజయవంతం అయిందనే మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.