ఆదోని యువకుడి ఇంటి ఎదుట హైదరాబాద్ హిజ్రా నిరసన

ప్రేమ పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశాడని.. తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొంది.;

Update: 2025-05-01 04:03 GMT

ప్రేమ పేరుతో మోసం చేసి తనను పెళ్లాడినట్లుగా ఆరోపిస్తూ హైదరాబాద్ కు చెందిన హిజ్రా (హసీనా) ఒకరు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువకుడి ఇంటి ఎదుట నిరసన దీక్ష చేపట్టిన వైనం సంచలనమైంది. సదరు హిజ్రా వాదన ప్రకారం.. తనను గణేశ్ ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఇప్పుడు మోసం చేస్తున్నట్లుగా ఆరోపిస్తోంది. ఆదోని మండలానికి చెందిన గణేష్.. తొమ్మిది నెలల క్రితం తనకు పరిచయమైనట్లుగా హసీనా పేర్కొంది.

ప్రేమ పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశాడని.. తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొంది. కొద్ది రోజులు తనతోనే ఉన్న గణేష్.. ఊరెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని.. తిరిగి రాలేదని చెప్పింది. గణేష్ చదువుల కోసం ఇతర అవసరాల కోసం తాను రూ.15 లక్షలు ఖర్చుచేసినట్లుగా పేర్కొంది. తమ మధ్య నాలుగేళ్లుగా ఇన్ స్టాలో పరిచయం ఉందన్న ఆమె.. తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఫిట్స్ వస్తున్నట్లుగా పేర్కొంది.

తనకు న్యాయం చేయాలంటూ ట్రాన్స్ జెండర్ హసీనా చేపట్టిన నిరసన దీక్షకు మరో నలుగురు హిజ్రాలు మద్దతు పలికారు. దీంతో.. ఈ వ్యవహారం పోలీసులకు చేరింది. వారు సదరు ట్రాన్స్ జెండర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లో ఇప్పటికే కేసు నమోదై ఉందని.. ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్నట్లుగా ఆదోని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News