‘వీధి కుక్కల దత్తత’.. వినూత్న కార్యక్రమానికి తెరతీసిన జీహెచ్ఎంసీ..
కొన్ని కొన్ని జాతులు కొన్ని కొన్నింటిలో ప్రసిద్ది చెందినవి కాబట్టి వాటినే పెంచుకునేందుకు యజమానులు ఇంట్రస్ట్ చూపుతున్నారు.;
కుక్కలు అంటే విశ్వాసానికి ప్రతీక. ఒక్క ముద్ద పెడితే చాలు జీవితాంతం రుణపడి ఉంటాయి. కొన్ని కొన్ని కుక్కలు తన యజమాని బయటకు వెళ్తే.. వచ్చే వరకు యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు యజమాని వస్తాడో.. తను కనిపించకుంటే బాధపడతాడోనని అని అనుకుంటాయి. అంత విశ్వాసం చూపే జంతువు భూమిపై మరొకటి లేదంటే సందేహం లేదు. అయితే కుక్కలను పెంచే యజమానులు వివిధ జాతులకు చెందిన వాటినే మచ్చిక చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కొన్ని కొన్ని జాతులు కొన్ని కొన్నింటిలో ప్రసిద్ది చెందినవి కాబట్టి వాటినే పెంచుకునేందుకు యజమానులు ఇంట్రస్ట్ చూపుతున్నారు.
కుక్కల విషయంలో సుప్రీకోర్టు కీలక నిర్ణయం
హైదరాబాద్ వంటి మహానగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. వాహనదారులను భయాందోళనకు గురి చేయడం, కరవడం లాంటివి చేస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వీధి కుక్కలకు కూడా షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిలో ఉంచాలని పేర్కొంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఇంకా కుక్కల విషయంలో కొందరు సెలబ్రెటీలు సుప్రీం నిర్ణయం సరైనదే అన్నారు. వీధి కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేసి ఉంచితే ఎంత ప్రభుత్వ ధనం వెచ్చించాల్సి వస్తుందని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో కొన్ని ఎన్జీఓల సాయంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అదే ‘కుక్కల దత్తత స్వీకారం.’
వీధి కుక్కల దత్తత..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆగస్ట్ 17ను కుక్కల దత్తత దినంగా ప్రకటించింది. ఈ రోజు జాతి కుక్కలను దత్తత ఇస్తారు. దీని కోసం బంజారాహిల్స్ రోడ్డు నెం. 1లో జలగం వెంగళరావు పార్కులో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దత్తత స్వీకారం నిర్వహిస్తారు. దత్తత కోసం అందుబాటులో వీధి కుక్కలను ఉంచుతున్నారు. వీటిని దత్తతకు రెడీ చేశారు. అంటే.. టీకాలు వేసి ఆరోగ్యంగా ఉన్న వాటినే ఈ కార్యక్రమంలో ఉంచుతున్నారు.
విశ్వాసానికి, నమ్మకానికి జాతి కుక్కలు నమ్మకమైనవి వైద్యులు చెప్తున్నారు. వీటిని సాకాలంటే పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. వివిధ జాతుల కుక్కలను సాకాలంటే వేల నుంచి లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ వీటి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. జంతు ప్రేమికులు, కుక్కలను దత్తత తీసుకునే వారు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది.