హైదరాబాద్ చర్టెడ్ అకౌంటెంట్.. రెండేళ్ల కుమార్తెతో సూసైడ్

కుటుంబ కలహాలతోనే ఆమె ఈ విపరీత నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..;

Update: 2025-11-05 07:09 GMT

తెలిసినంతనే అయ్యో అనిపించే విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఉన్నత చదువు చదివి.. మంచి ప్రొఫెషన్ లో ఉన్న ఆమె.. అతి చిన్న వయసులోనే సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. రెండేళ్ల కూతురితో కలిసి హుస్సేన్ సాగర్ లో ఆత్మహత్య చేసుకున్న 28 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ ఉదంతమిది. కుటుంబ కలహాలతోనే ఆమె ఈ విపరీత నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ పాతబస్తీలో నివాసం ఉండేవారు పృథ్వీ లాల్, కీర్తిక అగర్వాల్ దంపతులు. పృథ్వీ లాల్ బిజినెస్ చేస్తుండేవారు. కీర్తిక లాల్ చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నారు. వీరిద్దరికి రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే.. ఏడాదిన్నర క్రితం వారిద్దరి మధ్య గొడవ జరిగి విడిగా ఉంటున్నారు. బహుదూర్ పురలో తన తల్లిదండ్రుల వద్ద కుమార్తెతో కలిసి ఉంటోంది కీర్తిక లాల్.

ఏమైందో ఏమో కానీ.. నవంబరు రెండో తేదీన ఆమె తన కుమార్తెతో కలిసి కనిపించకుండా పోయారు. దీంతో కీర్తిక అగర్వాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే..తాజాగా నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ సమీపానికి డెడ్ బాడీ కొట్టుకు రావటంతో స్థానికులు లేక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియన డెడ్ బాడీగా తేల్చి.. మార్చురీకి తరలించారు.

అప్పటికే కీర్తిక లాల్ మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్ లో నమోదై ఉండటంతో.. ఇరువురి పోలికలు మ్యాచ్ కావటంతో కీర్తిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు.. సదరు డెడ్ బాడీ తమ కుమార్తెగా గుర్తించారు. ఈ క్రమంలో చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నించగా..పాప డెడ్ బాడీని గుర్తించారు. కుటుంబ కలహాలతో విరక్తి చెంది కుమార్తెతో కలిసి సూసైడ్ చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News