కోడింగ్ వదిలేసి 'కిక్' కోసం వెతికారు: హైదరాబాద్‌లో ఐటీ బాబుల గంజాయి గుట్టురట్టు!

నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న నీతూ భాయ్ అనే ఘనుడు ఒక పక్కా బిజినెస్ ప్లాన్‌తో రంగంలోకి దిగాడు. ఐటీ కంపెనీలు టార్గెట్‌గా గంజాయి సప్లై కేంద్రాన్ని తెరిచాడు.

Update: 2026-06-11 04:45 GMT

హైదరాబాద్ ఐటీ కారిడార్ అంటే ఒకప్పుడు బిర్యానీ సువాసనలు.. కీబోర్డ్ చప్పుళ్లు.. డాలర్ల చేరదీతలే గుర్తొచ్చేవి. కానీ ఈ మధ్య కొందరు ఐటీ బాబులు రూటు మార్చారు. సాఫ్ట్‌వేర్ కోడింగ్ ఒత్తిడిని తట్టుకోవడానికి 'గ్రీన్ కోడింగ్' లాంటి గంజాయి వైపు అడుగులు వేశారు. తాజాగా హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న యాంటీ డ్రగ్ విభాగం 'ఈగిల్' బృందాలు వేసిన స్కెచ్‌కి ఏకంగా 50 మంది అడ్డంగా బుక్కయ్యారు వీరిలో కొంత మంది సాఫ్ట్వేర్ బాబులు ఉన్నారు. వీకెండ్ పార్టీ మూడ్‌లో ఉన్న వీరంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లైట్లలో మెరిసిపోతున్నారు.

నీతూ భాయ్ 'వర్చువల్' ఆఫీస్.. కస్టమర్లు అంతా వీళ్లే!

నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న నీతూ భాయ్ అనే ఘనుడు ఒక పక్కా బిజినెస్ ప్లాన్‌తో రంగంలోకి దిగాడు. ఐటీ కంపెనీలు టార్గెట్‌గా గంజాయి సప్లై కేంద్రాన్ని తెరిచాడు. "వర్క్ ఫ్రమ్ హోమ్" బోర్ కొట్టిన వారికోసం "స్మోక్ ఫ్రమ్ హోమ్" ఆఫర్ పెట్టాడేమో కానీ ఈగిల్ బృందాలకు ఈ సమాచారం లీకైంది. పోలీసులు మెరుపు దాడి చేసేసరికి మెయిన్ లీడర్ నీతూ భాయ్ మాత్రం 'లాగ్ అవుట్' అయిపోయి ఎస్కేప్ అయ్యాడు.

ట్విస్ట్ ఏంటంటే పోలీసులు లోపలికి వెళ్లి చెక్ చేస్తే.. అక్కడ ఉన్నది గంజాయి బ్యాచ్ కాదు.. పొద్దున లేస్తే బ్లూ ఫార్మల్స్ వేసుకుని తిరిగే బహుళజాతి కంపెనీల ఉద్యోగులు.. ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టి మరీ ఈ నెట్‌వర్క్‌లో యాక్టివ్‌గా ఉన్న 50 మంది బాబులను పోలీసులు 'ఆఫీస్ క్యాబ్' ఎక్కించినట్టు జీపుల్లో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు.

'స్ట్రెస్ రిలీఫ్' పేరుతో సరికొత్త అప్‌డేట్

ప్రాథమిక విచారణలో తేలిందేంటంటే.. నైట్ షిఫ్టులు, క్లయింట్ల టార్గెట్లు, మేనేజర్ల తిట్లు.. ఇలాంటి "ఉద్యోగ ఒత్తిడి" నుంచి రిలీఫ్ కోసం వీరంతా ఈ అలవాటును సాఫ్ట్‌వేర్ ప్యాచ్ లాగా లైఫ్‌లో అప్‌డేట్ చేసుకున్నారట. రాత్రి వేళల జీవనశైలిని ఆసరాగా చేసుకుని డ్రగ్ మాఫియా ఐటీ కారిడార్‌ను లాభాల మార్కెట్‌గా మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనపై 'జీరో టాలరెన్స్' అంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈగిల్ బృందాలకు "ఎవరినీ వదిలిపెట్టొద్దు" అంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దాంతో పోలీసులు కూడా హైపర్ యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లారు.

హెచ్ఆర్ కి ఇప్పుడు కొత్త తలనొప్పి!

ఈ ఘటనతో నగరంలోని ఐటీ కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. సోమవారం ఆఫీసుకి ఎవరు వస్తారు.. ఎవరికి పోలీసులు 'నోటీసులు' ఇచ్చారో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మొత్తానికి "లైఫ్‌లో కిక్ ఉండాలి బ్రో" అని గంజాయి వెనుక పరిగెత్తిన ఈ 50 మంది కెరీర్ ఇప్పుడు 'క్రాష్' అయ్యే ప్రమాదంలో పడింది. నగరంలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఇంకా పెద్ద ఆపరేషన్లకు ప్లాన్ చేస్తున్నారు. సో.. బాబులూ, కోడింగ్ చూసుకోండి కానీ ఇలాంటి 'సైడ్ ప్రాజెక్టులు' పెడితే ఈగిల్ కన్ను పడటం ఖాయం!

Tags:    

Similar News