హైదరాబాదులో బీచ్.. నమ్మడం లేదా..అయితే ఇది చూడండి!
హైదరాబాదులో బీచ్ ఉంటే చాలా అద్భుతంగా ఉండేది అని ఎంతోమంది ప్రకృతి ప్రేమికులతో పాటు సినిమా వాళ్లు కూడా అనుకున్నారు.;
హైదరాబాదులో బీచ్ ఉంటే చాలా అద్భుతంగా ఉండేది అని ఎంతోమంది ప్రకృతి ప్రేమికులతో పాటు సినిమా వాళ్లు కూడా అనుకున్నారు. ఎందుకంటే హైదరాబాదులో అన్నీ ఉన్నాయి కానీ ఒక్క బీచ్ తప్ప.ఇప్పటికే హైదరాబాదులో షూటింగ్ జరుపుకునే చాలా సినిమాలు.. బీచ్ ల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఒకవేళ వెళ్లడానికి వీలు కాకపోతే కృత్రిమ బీచ్ లను అరేంజ్ చేసుకునేవారు. అలా హైదరాబాదులో బీచ్ లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పాటు ప్రకృతి ప్రేమికులు కూడా కాస్త హర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళుతూ ఉంటారు. అయితే చాలా రోజుల నుండి హైదరాబాద్ కి బీచ్ తీసుకువస్తామంటూ ఎంతో మంది రాజకీయ నేతలు తమ రాజకీయ ప్రసంగాలలో హామీలు ఇస్తున్నారు.
పైగా వీళ్ళు హామీలు ఇచ్చిన ప్రతిసారి.. ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి సెటైర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ బీచ్ సెటైర్లపై అందరి నోర్లు మూయించే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే హైదరాబాద్ కి బీచ్ తీసుకు వస్తామని రాజకీయ నేతలు హామీ ఇవ్వడం కాదు రియల్ గానే బీచ్ ని తీసుకురాబోతున్నారు. ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ కి బీచ్ ను కూడా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఉండే కొత్వాల్ గూడా వద్ద ఆర్టిఫిషియల్ బీచ్ అంటే కృత్రిమ బీచ్ ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట.. కొత్వాల్ గూడలో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ కృత్రిమ బీచ్ ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది డిసెంబర్ నుండే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఈ కృత్రిమ బీచ్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం దాదాపు రూ.225 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది..
ముఖ్యంగా ఈ కృత్రిమ బీచ్ ప్రాజెక్టుని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కూడా రెడీ అయింది.. చాలామంది ఈ ప్రాజెక్టు నిర్మించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలైతే ఈ ప్రాజెక్టు కోసం రూ.225 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే ఈ కృత్రిమ బీచ్ లో కేవలం ఇసుకతో కూడిన సముద్రతీరం మాత్రమే కాకుండా మరింత ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారట.
హైదరాబాద్లో కృత్రిమ బీచ్ ని తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. హైదరాబాద్ ని ప్రపంచ టూరిజం మ్యాప్ లో స్పెషల్ గా నిలిపే లక్ష్యంతోనే ఈ పనికి పూనుకున్నట్టు తెలుస్తోంది.ఇందులో వేవ్ ఫూల్స్, ఫ్లోటింగ్ విల్లాస్, సాహస క్రీడలు వీటన్నింటిని కూడా లగ్జరీ వసతులతో నిర్మించబోతున్నారట. ఇప్పటికే కొత్వాల్ గూడలోని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఈ కృత్రిమ బీచ్ కోసం స్థలాన్ని కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ కృత్రిమ బీచ్ వస్తే మాత్రం హైదరాబాద్ కి మరింత గుర్తింపు వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ కృత్రిమ బీచ్ ద్వారా చాలామంది ప్రకృతి ప్రేమికులు సముద్రతీరంలో ఉన్న అనుభూతిని పొందుతారు.అలాగే హైదరాబాద్ కి మరింత మంది పర్యాటకులు కూడా వస్తారు. సినిమా వాళ్లకు కూడా బీచ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పని తప్పుతుంది.