హాంగ్ కాంగ్ అపార్ట్ మెంట్ లో మంటలు...భారీ కుట్రకు ప్లాన్...
అత్యాధునిక నగరంగా ప్రసిద్ధి పొందిన హాంకాంగ్ పేరు వినగానే ఆకాశ హర్మ్యాలను తలపించే బహుళ అంతస్తుల భవనాలే మనకు గుర్తొస్తాయి.;
అత్యాధునిక నగరంగా ప్రసిద్ధి పొందిన హాంకాంగ్ పేరు వినగానే ఆకాశ హర్మ్యాలను తలపించే బహుళ అంతస్తుల భవనాలే మనకు గుర్తొస్తాయి. మేఘాలను ముద్దాడేంత ఎత్తులో నిటారుగా నిలుచున్న అపార్ట్ మెంట్లలో ఎందరో సురక్షతంగా జీవిస్తుంటారు. అయితే బుధవారం హాంకాంగ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పలువురిని షాక్ కు గురిచేసింది. ఈ దుర్ఘటనలో దాదాపు 94 మందికి పైగా మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం అదాటున జరగలేదని, పెద్ద కుట్రకోణమే దాగుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
.ఈ అపార్ట్ మెంట్ లో 32 అంతస్తులున్నాయి. ఎన్నో కుటుంబాలు నివాసముంటున్న ఈ అపార్ట్ మెంట్ లో ఇంత భారీ అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా జరిగిందా? ఇది యాదృచ్ఛికమా? లేదా కుట్రకోణముందా అన్న అంశం పలువురిలో చర్చగా మారుతోంది. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే సరిగ్గా ఈ ప్రమాదానికి ముందు బిల్డింగ్ నుంచి భారీ పేలుడు శబ్దాలు వినిపించడం పలు సందేహాలకు తావిస్తోంది. చెక్కలకు మంటలు అంటుకోవడం కూడా భారీ ప్రమాదానికి కారణంగా ఏఎఫ్ బీ రిపోర్ట్ చెబుతోంది.
.అభివృద్ధి చెందిన హాంగ్ కాంగ్ నగరంలో ఓ బహుళ అంతస్తు భవనం నిర్మించాలంటే అనుమతులు ఎలా పడితే అలా ఇవ్వరని, సేఫ్టీ ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షిస్తారని అంటున్నారు. అయితే మరి ఈ భవనం నిర్మాణంలో లొసుగులున్నాయా? భవనం నిర్మించి ఎన్నేళ్ళయ్యింది? లోపలై విద్యుత్తు వైరింగ్ ఎలా ఉంటోంది? అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలున్నాయా? ఇవన్నీ ఇపుడు ఆలోచించాల్సిన అంశాలు.
ఫైనిన్షియల్ హబ్ గా వేగంగా విస్తరిస్తున్న తైపో కోర్టు కాంప్లెక్స్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దాదాపు రెండువేల ఫ్లాట్లున్న ఈ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన...ప్రమాదమా...మానవ తప్పిదమా...విద్రోహమా అన్న అంశాలపై పోలీసులు చాలా నిశితంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే అపార్ట్ మెంట్ లో మంటలు వ్యాపించిన సమయంలో ఇందులో ఉంటున్న వారు తమ ఇళ్ళలోనే కిటికీలు మూసుకుని ఉండటం వల్ల కూడా ఊపిరాడకుండా సతమతమయినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. దీనికి తోడు ప్రమాద సమయంలో భారీగా గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 900 మందికి పైగా బాధితులకు తాత్కాలిక వసతి కల్పించారు. మంటల్ని అదుపు చేయడంలో 270 మంది ఫైర్ ఫైటర్లు పాల్గొన్నట్లు హాంగ్ కాంగ్ లీడర్ జాన్ లీ వివరించారు. కాగా ఈ ప్రయత్నంలో ఓ ఫైర్ ఫైటర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
.