న్యూ మెక్సికోలో గ్రహాంతరవాసులు.. తెరపైకి సంచలన విషయాలు!

గ్రహాంతర వాసులకు సంబంధించిన చర్చ నేడు కొత్తగా మొదలైంది కాకపోయినా.. దీనిపై ఎవరి అభిప్రాయాలు, ఎవరి నమ్మకాలు వారికి ఉన్నాయి.;

Update: 2025-11-23 18:30 GMT

గ్రహాంతర వాసులకు సంబంధించిన చర్చ నేడు కొత్తగా మొదలైంది కాకపోయినా.. దీనిపై ఎవరి అభిప్రాయాలు, ఎవరి నమ్మకాలు వారికి ఉన్నాయి. ఇందులో భాగంగా... ఈ సువిశాల విశ్వంలో భూమిపై మాత్రమే జీవం ఉందని కొంతమంది బలంగా నమ్ముతుంటే.. భుమిపై మాత్రమే కాకుండా కచ్చింతంగా ఈ విశ్వంలో మరో చోటా జీవం ఉండి ఉంటుందని మరికొందరు భావిస్తుంటారు.

ఈ విషయంలో కేవలం నమ్మకాలు మాత్రమే కీలక భూమిక పొషిస్తుంటాయి! ఈ భూమిపై మాత్రమే దేవుడు జీవాన్ని సృష్టించాడని కొంతమంది చెబుతుంటే.. అందుకు పూర్తి భిన్నమైన వాదన మరికొందరిది. ఈ క్రమంలో అమెరికాలోని న్యూ మెక్సిలో గ్రహాంతరవాసులను ఎయిర్ ఫోర్స్ బేస్ లోని సిబ్బంది చూశారని చెబుతూ న్యూయార్క్ పోస్ట్ తాజా డాక్యుమెంటరీలో పేర్కొంది. ఇది సంచలనంగా మారింది.

అవును... 1964లో న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బెస్ వద్ద జరిగిన గ్రహాంతరవాసులను చూసిన విషయం గురించి మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సీనియర్ (1989-93 కాలంలో ప్రెసిడెంట్) అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో (1976-77).. ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారులు ఆయనకు చెప్పారని ఈ డాక్యుమెంటరీ చెప్పుకొచ్చింది!

అయితే ఈ వాదనకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి భౌతిక ఆధారాలు సమర్పించబడలేదు. "ది ఏజ్ ఆఫ్ డిస్ క్లోజర్" అనే డాక్యుమెంటరీలో 2003లో జరిగిన ప్రైవేటు సంభాషణలో దివంగత అధ్యక్షుడు జార్జి బుష్ సీనియర్ ఈ సంఘటన గురించి తనతో స్వయంగా చెప్పారంటూ పేర్కొన్న ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎరిక్ డేవిస్ తో జరిగిన ఇంటర్వ్యూ ఉంది.

వాస్తవానికి 2007లో దివంగత సెన్ యారీ రీడ్ కాంగ్రెస్ రూపొందించిన అడ్వాన్స్డ్ ఏరో స్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం (ఏఏటీఐపీ) కి ఈ ఎరిక్ డెవిస్ సలహాదారుగా పనిచేశారు.

ఆ నివేదిక ప్రకారం... హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు సమీపానికి మూడు అంతరిక్ష నౌకలు వచ్చాయని.. వాటిలో ఒకటి మాత్రం కిందకు దిగిందని.. అందులోనుంచి దిగిన ఓ గ్రహాంతరవాసి.. వైమానిక దళం సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నించినట్లు అధికారులు.. బుష్ కు సమాచారం ఇచ్చారని ఎరిక్ డేవిస్ వెల్లడించారు. ఇంతకు మించి ఏమీ తనకు బుష్ చెప్పలేదని అన్నారు.

మరోవైపు.. గ్రహాంతర వాసులకు సమీపంగా వెళ్లిన సిబ్బందికి కాలిన గాయాలు, అంతర్గత మచ్చలు ఏర్పడినట్లు స్టాన్ ఫోర్డ్ యూనివరిస్టీ రోగనిరోధక శాస్త్రవేత్త, క్యాన్సర్ పరిశోధకుడు గ్యారీ నోలన్ నివేదికలో పేర్కొన్నారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్ష ప్రసారం అయిన ఈ డాక్యుమెంటరీలో భౌతిక శాస్త్రవేత్త, ఏఏటీఐపీ సభ్యుడు హోల్ పుథాప్ సాక్ష్యాలు కూడా ఉన్నాయని నివేదిక పేర్కొంది!

Tags:    

Similar News