ఓటు వేసేందుకు బ్రహ్మచారుల కండిషన్స్ వైరల్!

అవును... తాజాగా పెద్ద సంఖ్యలో పెళ్లికాని పురుషుల సమూహం ఒకచోట గుమిగూడి... తమకు ఉపాధి లేదు, భార్య పిల్లలు కూడా లేకుండా తమ జీవితాలు ఎలా కష్టాల్లో కూరుకుపోతున్నాయో చెప్పుకుంటున్నారు.

Update: 2024-05-18 06:44 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారీ భారీ హామీలతో నేతలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తుంటే... ఎన్నికలయ్యాక వీరు దొరకరనే బలమైన నమ్మకంతో ఓటర్లు కూడా తమ కోరికల చిట్టాలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలో... తాజాగా బ్రహ్మచారులు తెరపైకి వచ్చారు.

అవును... తాజాగా పెద్ద సంఖ్యలో పెళ్లికాని పురుషుల సమూహం ఒకచోట గుమిగూడి... తమకు ఉపాధి లేదు, భార్య పిల్లలు కూడా లేకుండా తమ జీవితాలు ఎలా కష్టాల్లో కూరుకుపోతున్నాయో చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా... తమది నిరంతరం అవమానకరమైన జీవితం అని వాపోతున్నారు.

45 ఏళ్ల వీరేంద్ర సంగ్వాన్... 2012లో సమస్త్ అవివాహిత్ పురుష్ సమాజ్ (40 ఏళ్లు దాటిన బ్రహ్మచారుల సంఘం), 2022లో హర్యానాలోని దాదాపు ఏడు లక్షల మంది ఒంటరి పురుషుల ఆందోళనలను వినిపించేందుకు ఎకిక్రిత్ రాండా యూనియన్ (వితంతువుల సంఘం)ని ఏర్పాటు చేశారు. హర్యానాలోని హిసార్‌ లోని మజ్రా పియావు గ్రామంలో ఎవరూ లేని ఈ వ్యక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి అతడు ఈ ఆశ్రయాన్ని నిర్మించాడు.

ఈ సందర్భంగా... పెళ్లికాని వారికి, వితంతువులకు పింఛను పథకాలను సక్రమంగా అమలు చేస్తామని రాజకీయ పార్టీ లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప, ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయకూడదని ఈ సంఘాలు నిర్ణయించుకున్నట్లు సాంగ్వాన్, ఇతర సభ్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో... "మేము ఈసారి ఓటు వేయము.. వాళ్ళు చేసేదంతా బూటకపు వాగ్దానాలు మాత్రమే అయినప్పుడు ఓటు వేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?" అని ప్రశ్నిస్తున్నారు.

Read more!

ఇదే సమయంలో... "జనాభా గణన జరగలేదు.. బ్యాచిలర్స్ జనాభా గణనను మేము డిమాండ్ చేసాము.. అయితే హర్యానాలో లింగ నిష్పత్తి యొక్క ఖచ్చితమైన వాస్తవికత అనేది జనాభా గణన నిర్వహించబడినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది.. బేటీ బచావో బేటీ పఢావో అంటూ బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ ఏమీ మారలేదు" అని సాంగ్వాన్ చెప్పారు.

కాగా... హర్యానాలోని మొత్తం 10 లోక్‌ సభ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2014 ఎన్నికల సీజన్‌ లో జింద్‌ లో ఇదే విధమైన డిమాండ్ వినిపించిన సంగతి తెలిసిందే. కాకపోతే... ఇక్కడ బ్రహ్మచారులు లోక్‌ సభ అభ్యర్థులను ఓట్లు కావాలంటే... అందుకోసం తమకు పెళ్లికూతుళ్లను తీసుకురావాలని కోరారంటూ కథనాలొచ్చాయి!

Tags:    

Similar News