హర్యానా సర్కారు కీలక ఆదేశం.. మతం దాచి పెట్టి చేసే పెళ్లికి పదేళ్లు జైలు

మతాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకునే వారికి పదేళ్లు జైలు.. భారీ జరిమానా తప్పదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.;

Update: 2025-08-09 03:55 GMT

మతాంతర పెళ్లిళ్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది హర్యానా ప్రభుత్వం. మతాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకునే వారికి పదేళ్లు జైలు.. భారీ జరిమానా తప్పదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మత మార్పిడి నిరోధక చట్టం 2022 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు.. కలెక్టర్లను ఆదేశించింది.

పెళ్లి కోసం జరిగే మతమార్పిడిని నిరోధించే చట్టాన్ని పక్కాగా అమలు చేయాలన్నది హర్యానా ప్రభుత్వ ఆలోచన. మతమార్పిళ్ల నిరోధక చట్టం 2022లో పేర్కొన్న అంశాల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని పేర్కొంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే రూ.4 లక్షలు జరిమానాతో పాటు.. పదేళ్లు జైలుశిక్షకు అవకాశం ఉంది.

చట్టంలో పేర్కొన్న విధంగా మతమార్పిడికి సంబంధిత వ్యక్తులు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. నిర్ణీత గడువు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా బలవంతంగా.. మోసపూరిత విధానంలో జరిగే మత మార్పిళ్లను రద్దు చేస్తారు. మత స్వేచ్ఛను అడ్డుకోవాలన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. అదే సమయంలో మత మార్పిళ్లకు సంబంధించి చట్టవిరుద్దమైన కార్యకలాపాల్ని నిరోధించటమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

Tags:    

Similar News