టీడీపీ ఆఫీసులో అటెండర్ గా పని చేయాల్సిన హరీశ్.. సవాలు విసురుడేంది?

దీనికి కారణం లేకపోలేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ సవాలుకు ఓకే అనని హరీశ్.. తాజాగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విసిరటం తెలిసిందే.

Update: 2024-04-27 06:24 GMT

ఏదోలా హడావుడి చేయటం.. లైమ్ లైట్ లో ఉండటం.. తెలంగాణ నినాదానికి.. సెంటిమెంట్ కు తాము మాత్రమే హక్కుదారులుగా భావించటం ఒక ఎత్తు అయితే.. అదే నిజమని పూర్తిగా నమ్మటం గులాబీ పార్టీ నేతలకు ఉన్న ఒక బలహీనతగా చెప్పాలి. దాని నుంచి బయటకు రాలేక.. వారు చేస్తున్న వ్యాఖ్యలతో వారి మీద ప్రజల్లో గౌరవ మర్యాదలు మరింత తగ్గుతున్నాయని చెప్పాలి. తాజాగా మాజీ మంత్రి హరీశ్ సవాల్ ఎపిసోడ్ చూస్తే..ఒక రేంజ్ మెలోడ్రామా కొట్టొచ్చినట్లు కనిపించక మానదు.

దీనికి కారణం లేకపోలేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ సవాలుకు ఓకే అనని హరీశ్.. తాజాగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విసిరటం తెలిసిందే. అందుకు వచ్చిన ప్రతిసవాల్ ను పట్టించుకోకుండా.. తన వాదనకు మరిన్ని అంశాల్ని జోడించటం.. గన్ పార్కు వద్దకు మందితో వచ్చి హడావుడి చేయటం లాంటవి ఔట్ డేటెడ్ రాజకీయమన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిదంటున్నారు.

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను.. రైతుల రుణమాఫీని ఆగస్టు 15 నాటికి అమలు చేయకుంటే రేవంత్ తన సీఎ పదవికి రాజీనామా చేయాలని.. ఒకవేళ ప్రభుత్వం కనుక తన సవాలుకు తగ్గట్లే.. హామీల్ని అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పటం తెలిసిందే. తన సవాలుకు కట్టుబడినట్లుగా బిల్డప్ ఇచ్చిన హరీశ్ మాటల్ని నిశితంగా గమనిస్తే.. ఆయనలోని పిరికి నేత కొట్టొచ్చినట్లు కనిపిస్తారని చెప్పాలి.

ఎందుకుంటే.. రేవంత్ సర్కారు ఆరు హామీల్ని అమలు చేస్తామని.. రైతులకు రుణమాఫీని ఆగస్టు 15న అందిస్తామని చెబుతుంటే.. వీటికి అదనంగా పదిహేను హామీల్ని సైతం అమలు చేయాలని.. అప్పుడే తాను రాజీనామా చేస్తానని హరీశ్ కొత్త మెలిక పెట్టటం.. గన్ పార్కు వద్ద ఆయన హైడ్రామాను చూసిన వారంతా.. .ఇదేం పద్దతి? అంటూ ప్రశ్నించేవారే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హరీశ్ కు గతాన్ని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం పీక్స్ కు చేరిన వేళలో.. హరీశ్ ఒక భారీ సవాలు విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణకు అనుకూలంగా యూపీఏ సర్కారుకు లేఖ రాసి ఇస్తే.. తాను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అటెండర్ గా పని చేస్తానంటూ సవాలు విసిరారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ రాసివ్వటం తెలిసిందే. చెప్పిన మాట మీద నిలబడే తత్త్వం హరీశ్ కు ఉండి ఉంటే.. ఇప్పటికే ఆయన టీడీపీ ఆఫీసులో అటెండర్ గా ఉండాలే కానీ.. ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు. సమయానికి తగ్గట్లు పొలిటికల్ డ్రామాలు ఆడే హరీశ్ లాంటి నేతలకు గతాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించాల్సిన అవసరం ఉంది. కాదంటారా?

Tags:    

Similar News