కేసీఆర్ హెల్త్ ఎలా ఉంది...హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తెలంగాణా భవన్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ దీక్షా దివస్ కార్యక్రమంలో ఆ పార్టీ అగ్ర నేత హరీష్ రావు ప్రసంగించారు.;
తెలంగాణా రాష్ట్రం ఇస్తున్నామని సరిగ్గా 2009 డిసెంబర్ 9న అప్పటి యూపీయే ప్రభుత్వం పకటన చేసిన రోజు ఇది. ఆనాడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న పి చిదంబరం ఈ అంశం మీద సంచలనమైన ప్రకటన చేశారు. ఆ తరువాత అనేక పరిణామాలు జరిగాయి. అవి వేరే స్టోరీ. అసలైన స్టోరీ ఏంటి అంటే ఈ ప్రకటనకు పది రోజుల ముందు నవంబర్ 29న కేసీఅర్ అమరణ దీక్షకు దిగారు. తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన ఏకైక డిమాండ్ తో ఈ దీక్ష చేపట్టారు.
తెలంగాణా కోసం :
ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తెలంగాణా భవన్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ దీక్షా దివస్ కార్యక్రమంలో ఆ పార్టీ అగ్ర నేత హరీష్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు వెల్లడించారు. కేసీఆర్ అమరణ దీక్ష చేయకపోతే తెలంగాణా రాష్ట్ర ప్రకటన వచ్చేది కాదని అన్నారు. ఇక తెలంగాణా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసేందుకు సైతం కేసీఆర్ సిద్ధపడ్డారు అని గుర్తు చేసారు. వైద్యులు అంతా ఎంత చెప్పినా కేసీఆర్ మాట వినకుండా అమరణ దీక్ష చేశారు అన్నారు. దీక్ష కొనసాగిస్తే ఆయన ప్రాణాలు పోతాయని వైద్యులు చెప్పినా కూడా వినలేదని వస్తే తెలంగాణా జైత్ర యాత్ర, లేకపోతే తన శవయాత్ర అని ఆయన అన్నపుడు తనతో సహా బీఆర్ఎస్ నేతల కళ్ళలో నీళ్ళు తిరిగాయని అన్నారు. అంతటి దృఢ దీక్షత్గో పట్టుదలతో రాష్ట్రం కోసం కేసీఆర్ కృషి చేసి సాధించారు అన్నారు.
కేసీఆర్ ఆరోగ్యం :
ఇదిలా ఉంటే అమరణ దీక్ష తరువాత కేసీఆర్ హెల్త్ విషయంలో కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు అని తెలంగాణా ప్రజల ఆశీర్వాదంతో ఆయన పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారని చెప్పారు. ఇపుడు కూడా ఆయన పూర్తిగా హెల్తీగా ఉన్నారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు. అంతే కాదు ఆయన సరైన సమయంలో రంగంలోకి దిగుతారని తెలంగాణా ప్రజల కోసం ఆయన అండగా నిలబడతారని అన్నారు. 2028 లో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు.
చరిత్ర అంటే మాదీ :
తెలంగాణా కోసం ఎంతో పోరాటం చేసింది కేసీఆర్ అని అన్నారు. ఆయనకు పదవులు గడ్డి పోచతో సమానం అన్నారు. ఎన్నో సార్లు తెలంగాణా ప్రజలను వంచించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఒక చరిత్ర అన్నారు. ఆయన పేరు లేకుండా తెలంగాణా రాష్ట్రంలో ఏదీ ఉండదని హరీష్ రావు అన్నారు. నాడు తెలంగాణా ఉద్యమానికి ద్రోహం చేసిన వారే ఈ రోజు మరోసారి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. తెలంగాణా తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడా లేదని అన్నారు.
ఎన్నికలకు ముందు :
ఇదిలా ఉంటే హరీష్ రావు తాజా ప్రకటనతో కేసీఆర్ జనంలోకి రావడానికి ఇంకా రెండేళ్ళ సమయం పడుతుంది అని అంటున్నారు. 2028 చివరిలో ఎన్నికలు ఉన్నందువల్ల ఆయన 2028 మొదట్లో జనంలోకి వస్తారని అంటున్నారు. అప్పటికి అధికార పార్టీ మీద వ్యతిరేకత పూర్తిగా ఉంటుందని దానిని సొమ్ము చేసుకోవడానికి పెద్దాయన నేరుగా ఫీల్డ్ లోకి దిగుతారు అని అంటున్నారు. మొత్తానికి కేసీఅర్ హెల్దీగా ఉన్నారని ఆయన జనంలోకి వస్తారని చెప్పడం ద్వారా హరీష్ రావు బీఆర్ఎస్ క్యాడర్ లో ఫుల్ జోష్ ని తీసుకుని వచ్చారు అని అంతా అంటున్నారు.