ఏకపక్షంగా సీబీఐకి ఇచ్చారు: హైకోర్టులో హరీష్‌రావు
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరఫు న్యాయవాది.. దీనిపై వివరణ ఇచ్చేందుకు సమాచా రం కావాలని.. కొంత సమయం పడుతుందని కోరారు.;
తెలంగాణ అసెంబ్లీలో `కాళేశ్వరం కమిషన్` రిపోర్టుపై చర్చించకుండా చూడాలని కోరుతూ బీఆర్ ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై చర్చించకుం డా చూడాలని ముందుగానే ఆయన శనివారం పిటిషన్ వేశారు. అయితే.. కోర్టు సమయం ముగిసే వరకు కూడా రిజిస్ట్రీ నెంబరు ఇవ్వలేదు. దీంతో సోమవారంనాటికి ఇది వాయిదా పడింది. దీనిపై తాజాగా జరిగిన విచారణలో.. చర్చ ఎలానూ జరిగిపోయింది కాబట్టి.. చర్యల విషయంపై స్పందించారు.
``అసెంబ్లీలో చర్చించారు .. కదా?`` అని న్యాయమూర్తి అన్నప్పుడు.. ఔనని హరీష్‌రావు తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఇక, ఈ పిటిషన్ వృథాయే కదా.. అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఆయన వాద నలు వినిపిస్తూ.. చర్చించిన తర్వాత.. అందరి ఆమోదంతో చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం .. ఏకపక్షంగా సీబీఐకి అప్పగిస్తూ.. నిర్ణయం తీసుకుందని.. దీనిని రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కూడా కోరారు.
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరఫు న్యాయవాది.. దీనిపై వివరణ ఇచ్చేందుకు సమాచా రం కావాలని.. కొంత సమయం పడుతుందని కోరారు. అయితే.. హరీష్ రావు తరఫున న్యాయవాది మరోసా రి జోక్యం చేసుకుని.. అసలు చర్చ కాదని.. ఇప్పుడుసీబీఐని రద్దు చేయాలని కోరారు. కానీ.. హైకోర్టు వినలే దు. ఏదో ఒక విచారణ వేయాలని అనేది ప్రభుత్వ నిర్ణయం అయినప్పుడు తాము ఎలా జోక్యం చేసుకుం టామని ప్రశ్నించింది. సీబీఐ వేస్తే.. తప్పేముంది.. మీరు నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది కదా! అని వ్యాఖ్యానించడం గమనార్హం.
అంతేకాదు.. ప్రభుత్వం వివరణ కూడా తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేయాలన్న ప్రభుత్వ న్యాయవాది(అడ్వొకేట్ జనరల్) వాదనల ను తోసిపుచ్చుతూ.. మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటి వరకు వెయిట్ చేయాలని హరీష్ రావు తరఫు న్యాయ వాదికి సూచించింది.