H1B స్టేటస్‌కి ముప్పు తెచ్చే పాక్షిక ఉద్యోగం?
అమెరికాలో H1B వీసా పొందినవారికి నిర్దిష్ట నియమాలు వర్తిస్తాయి. ముఖ్యంగా వీసా దరఖాస్తులో పేర్కొన్న గంటల ప్రకారం ఉద్యోగి పని చేయాలి.;
అమెరికాలో H1B వీసా పొందినవారికి నిర్దిష్ట నియమాలు వర్తిస్తాయి. ముఖ్యంగా వీసా దరఖాస్తులో పేర్కొన్న గంటల ప్రకారం ఉద్యోగి పని చేయాలి. మీరు ఫుల్‌టైమ్ వర్క్‌కి అనుమతి పొంది, పార్ట్‌టైమ్ పనిచేస్తే, అది వీసా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అయితే ఈ అంశంపై పూర్తి స్పష్టత అవసరం.
ఉదాహరణకు కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగిని పార్ట్‌టైమ్ పని చేయమని కోరితే, అందులో ఉద్యోగికి తప్పు ఉండకపోవచ్చు. అలాగే STEM-OPT సమయంలో (H1B వీసా రాకముందు) పార్ట్‌టైమ్ పని చేయడం నిబంధనలకు విరుద్ధం కాదు, కాబట్టి ఆ సమయంలో చేసిన పనికి ఎలాంటి సమస్య ఉండదు.
అయితే భవిష్యత్తులో వీసా బదిలీ (transfer) లేదా గ్రీన్‌కార్డ్ దరఖాస్తు చేసేటప్పుడు, USCIS మీ పే స్టబ్స్‌ను అడిగితే, ఆ 3.5 నెలల పాక్షిక పని ప్రశ్నలకు తావిచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఆ కాలానికి సంబంధించిన పే స్టబ్స్, ఈమెయిల్స్, కంపెనీ అనుమతి లేఖలు వంటి అన్ని ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవడం ఉత్తమం.
కంపెనీ ఆ "పాక్షిక పని" సమయానికి ఉద్యోగికి పూర్తి వేతనం చెల్లించిందని నిరూపించగలిగితే అది మంచిదే. కానీ USCIS దృష్టిలో ఇది సరిపోదు; ఉద్యోగి వీసా నిబంధనలను ఎలా పాటించాడనేదే ముఖ్యంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి యజమాని ప్రయత్నించాడని ఇది సూచిస్తుంది.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. కంపెనీ ఆర్థిక ఇబ్బందుల వంటి కారణాలతో వీసా పిటిషన్‌లో సవరణలు అవసరమైతే, USCIS కొంతవరకు సహకరించే అవకాశం ఉంది.
USCIS భవిష్యత్తులో ఏవైనా ప్రశ్నలు అడిగితే, నిజాయితీగా, పారదర్శకంగా సమాధానం ఇవ్వడం ఉత్తమం. సరైన సమాచారం, అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో అనర్హతలు ఎదురయ్యే ప్రమాదం తగ్గుతుంది.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. నిబంధనలు పాటించకపోతే ఉద్యోగికే కాకుండా, యజమానికి కూడా శిక్షలు పడే అవకాశం ఉంది. వీసా నిబంధనల ఉల్లంఘనలకు కంపెనీ భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.
H1B వీసా హోల్డర్లు, యజమానులు ఇద్దరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో గ్రీన్‌కార్డ్ లేదా వీసా రెన్యూవల్ ప్రక్రియల్లో ఇబ్బందులు కలిగించవచ్చు. పే స్టబ్స్, ఈమెయిల్స్, అగ్రిమెంట్ లేఖలు వంటి అన్ని రకాల ఆధారాలను సేకరించి ఉంచాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి. పారదర్శకతే మీ ముందున్న రక్షణగా నిపుణలు సూచిస్తున్నారు..