దమ్ముంటే పట్టుకోండి... ఇక్కడ వెయిటింగ్...ట్రంప్ కి షాకిచ్చే సవాల్
తనను పట్టుకోవాలి అనుకుంటే తాను రెడీగా ఉన్నారు, వెయిట్ చేస్ద్తున్నాను అని కూదా గుస్తావో పెట్రో చెప్పడం విశేషం.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి అసలే దూకుడుగా ఉంటుంది అని అంటారు. ఆయన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని ఈ నెల 3న ఆయన ఇంట్లోనే ఉండగా సతీ సమేతంగా పట్టుకుని మరీ న్యూయార్క్ కోర్టు ముందు హాజరు పరచారు. ప్రస్తుతం జ్యూడిషియల్ విచారణలో మదురో ఉన్నారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తరువాత లిస్ట్ లో ఆ దేశాలు అంటూ కొలంబియా క్యూబా వంటి దేశాలు ఉన్నాయని భారీ సంకేతాలు ఇచ్చారు. అంతే కాదు కొలంబియాను ఒక చెడ్డ వ్యక్తి పాలిస్తున్నాడరని డ్రగ్స్ అమ్మకం చేసే నేత పాలనలో కొలంబియా తీవ్రంగా నష్టపోయింది అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో కొలంబియా దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కే ఆయన భారీ సవాల్ విసిరారు.
దమ్ముంటే పట్టుకెళ్ళు :
వెనెనులా అధ్యక్షుడు మదురోని పట్టుకెళ్ళిన తీరు ప్రపంచం మొత్తం చూసింది. అమెరికా అధ్యక్షుడి వైఖరి మీద అనుకూల ప్రతికూల స్పందనలు వచ్చాయి. అయితే అక్రమంగా డ్రగ్స్ మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారు అన్న దాని మీద మదురోతో పాటు ఆయన సతీమణిని కూడా పట్టెకెళ్ళినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. అవే ఆరోపణలు ఇపుడు కొలంబియా అధ్యక్షుడి మీద కూడా అమెరికా చేతోంది. దాంతో గుస్తావో పెట్రో దమ్ముంటే నన్ను పట్టుకెళ్ళు అంటూ బిగ్ సౌండ్ చేస్తున్నారు, మదురో తరహాలో తనను కూడా పట్టుకెళ్ళగలవా అని కూడా సవాల్ విసురుతున్నారు. అంతే కాదు తనను కనుక ఆ విధంగా పట్టుకెళ్ళాలంటే చాలా పరిణామాలు చూడాల్సి ఉంటుందని ట్రంప్ కే హెచ్చరించారు.
వేచి ఉన్నాను అంటూ :
తనను పట్టుకోవాలి అనుకుంటే తాను రెడీగా ఉన్నారు, వెయిట్ చేస్ద్తున్నాను అని కూదా గుస్తావో పెట్రో చెప్పడం విశేషం. అయితే తనను టచ్ చేసిన అనంతరం జరిగే పరిణామాలు కూడా ఆయన స్పష్టంగా చెప్పేశారు. నన్ను అమెరికా బలగాలు పట్టుకోవాలీ అనుకుంటే మా రైతులు గెరిల్లాలుగా మారుతారు అని వర్నింగ్ కూడా ఇచ్చేశారు. దేశ ప్రజలు అమితంగా ప్రేమించే తనను కనుక నిర్భంధించాలి అనుకుంటే ముందు కొలంబియా ప్రజల ఆగ్రవేశాలు తట్టుకుని దాటుకుని రావాలని కూడా ట్రంప్ కి సూచించారు. ఇక తాను కూడా ఆయుధాలు ధరించి వస్తాను అని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
ఫ్లాష్ బ్యాక్ లో అలా :
ఇదిలా ఉంటే గుస్తావో పెట్రో ఫ్లాష్ బ్యాక్ లో వామపక్ష గెరిల్లా గా ఉన్నారు. ఆయన అప్పట్లో సాయుధ పోరాటమే చేశారు. అయితే నిరాయుధీకరణకు కట్టుబడి వాటికి స్వస్తి చెప్పారు. ఆయుధాలు ముట్టను అని అప్పట్లో ప్రమాణం కూడా చేశారు. కానీ దేశం కోసం అవసరమైతే మరోసారి ఆయుధాలు ధరిస్తాను అని గుస్తావో పెట్రో తాజాగా చెబుతున్నారు. అంటే ట్రంప్ కి ఇది ఒక చాలెంజ్ గానే చూడాలా అన్న చర్చ సాగుతోంది.
మదురో ఇలాగే చేసి :
కాస్తా వెనక్కి వెళ్ళ్తే ప్రస్తుతం అమెరికా బంధీగా ఉన్న వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా ఇదే తీరున బిగ్ చాలెంజ్ చేశారు. నన్ను పట్టుకోండి చూద్దాం అన్నారు. ఆ సవాల్ చేసిన కొద్ది రోజులకే ఆయన ఇపుడు బంధీగా ఉన్నారు. మరి ఇదే తీరులో ఇంకా హీటెక్కించేలా కొలంబియా దేశాధినేత గుస్తావో పెట్రో ట్రంప్ కే సవాల్ విసురుతున్నారు. మరి ట్రంప్ దీనిని ఎలా తీసుకుంటారో. ఎందుకంటే తరువాత టార్గెట్ కొలంబియా క్యూబా అని ఒక లిస్ట్ కూడా ఉందని ప్రచారం సాగుతున్న వేళ ఈ గుస్తావో పెట్రో చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అయితే అంతర్జాతీయంగా విపరీతమైన చర్చకు తావిస్తున్నాయి.