కార్ లవర్స్ కి శుభవార్త.. దిగివస్తున్న ధరలు.. పెరుగుతున్న డిమాండ్!
మధ్యతరగతి వారు కూడా కారు కొనాలనే సొంత కలను కేంద్ర ప్రభుత్వం తీర్చేలా కనిపిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ నిజమైన ఫలితంగా..సరికొత్త జీఎస్టీ సవరణల వల్ల కార్ల తయారీదారులకు పలు రకాల ఊరట లభిస్తోంది.;
మధ్యతరగతి వారు కూడా కారు కొనాలనే సొంత కలను కేంద్ర ప్రభుత్వం తీర్చేలా కనిపిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ నిజమైన ఫలితంగా..సరికొత్త జీఎస్టీ సవరణల వల్ల కార్ల తయారీదారులకు పలు రకాల ఊరట లభిస్తోంది. దీనివల్ల కంపెనీలకు కలిగిన ప్రయోజనాన్ని కొంత వినియోగదారులకు కూడా బదిలీ చేస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ తన కార్ల ధరలను ఈనెల 22 నుంచి సుమారుగా రూ.1.55 లక్షల రూపాయల వరకు తగ్గించబోతున్నట్లు ప్రకటించారు. అటు మహీంద్రా అయితే ఏకంగా సెప్టెంబర్ 6 నుంచే తగ్గబోయే జీఎస్టీ ధరలతోనే కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు టయోటా కిర్లోస్కర్, రెనో ఇండియా వంటి బ్రాండ్స్ కూడా ఇదే బాట పడుతున్నాయి.
మహీంద్ర వాహనాలకు సంబంధించి ధరల తగ్గింపు విషయానికి వస్తే.. మహీంద్ర కార్లపై సెప్టెంబర్ 6 నుంచే తగ్గింపు ధరలు వర్తిస్తే.. టాటా, టయోటా , రెనో కార్లపై సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. మరి ఏఏ మోడల్స్ పై ఎంత మేరా ధర తగ్గుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం.
మహీంద్రా:
1).xuv3xo (డీజిల్) - రూ.1.56 లక్షల తగ్గింపు.
2).xuv3xo(పెట్రోల్) - రూ.1.40 లక్షల తగ్గింపు
3). స్కార్పియో - ఎన్ -రూ.1.45 లక్షల తగ్గింపు
4). ఎక్స్ యూవి -700- రూ.1.43 లక్షల తగ్గింపు.
5). థార్ 2 డబ్ల్యూడి(డీజిల్)- రూ.1.35 లక్షలు తగ్గింపు
6). థార్ రాక్స్ -రూ.1.33 లక్షలు
7). బొలెరో/నిమో - రూ.1.27 లక్షలు
8). థార్ 4 డబ్ల్యూడి (డిజల్) - రూ.1.01 లక్షలు
9). స్కార్పియో క్లాసిక్-రూ.1.01 లక్షలు
టయోటా కార్ల విషయానికి వస్తే:
1). ఫార్చునర్ - రూ.3.49 లక్షలు.
2). లెజెండర్ - రూ.3.34 లక్షలు
3). వెల్ ఫైర్ - రూ.2.78 లక్షలు.
4). హైలక్స్- రూ.2.52 లక్షలు.
5). క్రిస్టా- రూ.1.8 లక్షలు
6). హైక్రాస్ - రూ.1.15 లక్షలు
7).టైసర్- రూ.1.11 లక్షలు
కామ్రీ - రూ.1.01 లక్షలు
8).గ్లాంజా - రూ.85,300
9).హైరైడర్- రూ.65,400
10).రూమియన్ - రూ.48,700
రెనో ఇండియా కార్ల విషయానికి వస్తే:
1). కైసర్ - రూ.96,395
2). ట్రైబర్ - రూ.80,195
3). క్విడ్ - రూ.55,095
సరికొత్త జీఎస్టీ వ్యవస్థ ఈనెల 22వ తేదీ నుంచి పూర్తిగా అమలులోకి వస్తుంది కాబట్టి ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి , సీఎన్జీ వాహనాల ఇంజన్ కెపాసిటీ బట్టి 18% జిఎస్టి పరిధిలోకి కొన్ని వస్తాయి. గతంలో 28% ఉండే జీఎస్టీ.. ఇప్పుడు 18 % స్లాబ్ లోకి రాబోతున్నాయి. మరి సామాన్యులు కూడా కొనగలిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే జిఎస్టి తగ్గుదల కారణంగా.. ధరలు కూడా దిగివస్తుండడంతో అటు సామాన్యులు కూడా ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కార్లకి కూడా ఇప్పుడు భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు.