14 ఏళ్ల తర్వాత నెలలో పసిడి ఎంత భారీగా పెరిగిందంటే?

అవును.. పద్నాలుగేళ్ల రికార్డు బద్ధలైంది. ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకెళుతున్న బంగారం ధరలకు సంబంధించి మరో రికార్డు నమోదైంది.;

Update: 2025-10-01 10:30 GMT

అవును.. పద్నాలుగేళ్ల రికార్డు బద్ధలైంది. ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకెళుతున్న బంగారం ధరలకు సంబంధించి మరో రికార్డు నమోదైంది. అంతకంతకూ పెరుగుతూ.. సామాన్యుడి చూపు బంగారంవైపు పడాలన్నా భయపడే పరిస్థితికి వచ్చింది. సామాన్యుడే కాదు మధ్యతరగతి జీవి సైతం బంగారం కొనుగోలు చేసేందుకు భయపడే పరిస్థితి తాజాగా ఉంది. చూస్తుండగానే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.లక్ష దాటిపోగా.. చూస్తుండగానే ఆ ధర అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

తాజాగా బులియన్ మార్కెట్ లో బంగారం ధర పది గ్రాములు రూ.1.20 లక్షలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం పది గ్రాములు రూ.1,19,400 పలికింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం.. వెండి మీద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి.

స్వల్పకాలిక ఫండింగ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకపోవటంతో ప్రభుత్వానికి షట్ డౌన్ తప్పదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారుల ఫోకస్ మొత్తం ఈక్విటీల నుంచి బులియన్ మార్కెట్ల మీద ఫోకస్ పెరిగింది.

దీంతో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. బంగారం ధరలు గడిచిన పద్నాలుగేళ్లలో ఒక నెలలో భారీగా పెరిగిన మొదటి సందర్భంగా చెప్పాలి. ఒక్క సెప్టెంబరు నెలలో బంగారం ధరలో 11.4 శాతం పెరిగింది. 2011 ఆగస్టులో ఒకనెలలో అత్యధికంగా 15 శాతంపెరిగిన తర్వాత.. బంగారం ధర ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 23.5 శాతం పెరగటం గమనార్హం.

Tags:    

Similar News