మూడు రోజుల్లోనే రూ. 5670 పెరిగిన బంగారం ధర.. కొనాలంటే లోన్ తీసుకోవాలేమో ?
బంగారం కొనాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి.;
బంగారం కొనాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే వేలల్లో పెరుగుదల నమోదు కావడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. ఇంతకీ ఎందుకీ పెరుగుదల? రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి? సామాన్యుడిపై దీని ప్రభావం ఎలా ఉండనుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న పెరుగుదలతో, ధరలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. తాజాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1850 పెరిగి రూ. 87,450కి చేరింది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కూడా భారీగా పెరిగింది. రూ. 1870 పెరుగుదలతో ప్రస్తుతం రూ. 95,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ. 1,000 పెరిగి ప్రస్తుతం రూ. 1,08,000కు చేరుకుంది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ. 5670, కేజీ వెండిపై రూ. 5000 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థాయిలో ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఇతర ఆర్థిక కారణాలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సామాన్యులకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది. పసిడి, వెండి కొనాలనుకునేవారు ఈ ధరల పెరుగుదలను చూసి నిరాశ చెందుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయా లేదా స్థిరంగా ఉంటాయా అనేది వేచి చూడాలి.