పెళ్లిళ్ల సీజన్ మొదలు.. అయినా ఆగని బంగారం పరుగులు..

విషయంలోకి వెళ్తే.. ఒకప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉండేవి కాబట్టి 10 నుంచి 12 గ్రాముల బంగారంతో పెళ్లికూతురుకి తాళిబొట్టు, వరుడుకి ఉంగరం చేయించే వాళ్ళు.;

Update: 2025-10-19 05:31 GMT

హిందూ సాంప్రదాయం ప్రకారం రేపటి దీపావళి అమావాస్య మొదలుకొని కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది.. పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు.. అయితే పెరిగిన ధరల కారణంగా ఏం చేయాలో తెలియక వివాహానికి ముందు వరుడి కుటుంబానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక.. ఆడపిల్లల తల్లిదండ్రులు పడే కష్టాలు మామూలువు కాదు అని చెప్పవచ్చు. కార్తీక మాసంలో తమ కూతురికి పెళ్లి చేయాలని ఎంతోమంది తల్లిదండ్రులు ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బంగారం ధరలు తక్కువగా ఉండడంతో బంగారం కాస్త ఎక్కువగానే పెడతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ధరలు పెరిగిన కారణంగా చెప్పిన బంగారాన్ని ఇవ్వలేక ఇప్పుడు పెళ్లికూతురు తల్లిదండ్రులు చేస్తున్న పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

విషయంలోకి వెళ్తే.. ఒకప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉండేవి కాబట్టి 10 నుంచి 12 గ్రాముల బంగారంతో పెళ్లికూతురుకి తాళిబొట్టు, వరుడుకి ఉంగరం చేయించే వాళ్ళు. కానీ ఇప్పుడు బంగారం ధర సుమారుగా 1,30,000కి చేరుకుంది. ఇక దీంతో ధరలు పెరగడంతో ఎనిమిది గ్రాముల తోనే తాళిబొట్టు వరుడి ఉంగరం చేయిస్తున్నారని స్వర్ణకారులు కూడా చెబుతున్నారు.

ఇదిలా ఉండదా ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో.. ఆత్మకూరు మండలంలోని ఒక మధ్య తరగతి కుటుంబం తమ కూతురుకి వివాహ నిమిత్తం 12 తులాల బంగారం చేయిస్తామని హామీ ఇచ్చారట. అయితే ఆ సమయంలో బంగారం తులం రూ.90,000 ఉంది. కానీ వచ్చే నెల మొదటి వారంలోనే వివాహం ఉండడం తో పెరిగిన బంగారు ధరల కారణంగా ఇచ్చిన మాట నెరవేర్చలేక.. 8 తులాలే పెడతామని వరుడి కుటుంబాన్ని వేడుకోవడంతో వారు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇకపోతే ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా పెరిగిపోవడంతో కొత్తగా బంగారు ఆభరణాలను చేయించలేక పెళ్లికూతురు తల్లిదండ్రులు.. తల్లి దగ్గర ఉన్న బంగారాన్ని కరిగించి కొత్తగా బంగారాన్ని చేయిస్తున్నట్లు స్వర్ణకారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇచ్చిన మాటను తప్పలేక.. వరుడి కుటుంబాల దగ్గర తక్కువ కాలేక.. బయట అప్పు చేయలేక.. ఉన్న బంగారాన్ని కొత్త బంగారంగా మార్చి ఇస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాధారణంగా ఏదైనా పెళ్లిళ్లు, పండుగలు సీజన్ వచ్చిందంటే చాలు రోజుకి సుమారుగా 30 కిలోల వరకు బంగారం అమ్మకాలు జరిగేవట. కానీ ఇప్పుడు ధరలు పెరగడంతో సగానికి సగం అమ్మకాలు పడిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. దీనికి తోడు రోల్డ్ గోల్డ్ పై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. వన్ గ్రామ్ గోల్డ్ ధరలు చాలా తక్కువ కాబట్టి వివాహాది ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలి అంటే బంగారు నగలకు బదులుగా ఇలాంటి నగలతో వేడుకలను పూర్తి చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా బంగారం పెరుగుదల ఆడపిల్లల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది అని చెప్పవచ్చు.

Tags:    

Similar News