• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గోవా బీచ్ లో...

గోవా బీచ్ లో ప్రభుత్వాన్ని కదిలించిన ఘటన.. షాకింగ్ వీడియో!

| అవును.. గోవాలోని ప్రసిద్ధ అరాంబోల్ బీచ్ నుండి వచ్చిన ఒక వీడియో తీవ్ర కలకలం రేపింది. ఇందులో.. కొంతమంది బౌన్సర్లు ఇద్దరు విదేశీ మహిళలను ఫోటోలకు పోజులివ్వమని బలవంతం చేస్తున్నట్లు కనిపించింది.

By - Raja Ch
Update: 2025-11-07 10:17 GMT

గోవా బీచ్ లో ఓ పనికిమాలిన పని తెరపైకి వచ్చింది. ప్రపంచం ముందు భారతదేశం పరువు తీసే పనికి కొంతమంది బౌన్సర్లు పూనుకున్నారు! దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. పెట్రోలింగ్ పెంచుతామని, ఈ ఘటనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది!

అవును.. గోవాలోని ప్రసిద్ధ అరాంబోల్ బీచ్ నుండి వచ్చిన ఒక వీడియో తీవ్ర కలకలం రేపింది. ఇందులో.. కొంతమంది బౌన్సర్లు ఇద్దరు విదేశీ మహిళలను ఫోటోలకు పోజులివ్వమని బలవంతం చేస్తున్నట్లు కనిపించింది. ఆ పురుషులు సదరు మహిళల చుట్టూ చేతులు వేయడం.. ఆ సమయంలో ఆ విదేశీ వనితలు అసౌకర్యంగా ఉండటం కనిపించింది.

ఇదే సమయంలో వాగేటర్ నుండి నివేదించబడిన మరొక కేసులో.. స్థానిక సంస్థలోని బౌన్సర్లు అనుచితంగా జోక్యం చేసుకున్నారని, వారణాసి నుండి వచ్చిన ఓ కుటుంబానికి బాధ కలిగించారని ఆరోపించారు. దీంతో... పర్యాటకులను వేధిస్తున్న సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, పెట్రోలింగ్ పెంచుతామని గోవాలోని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్ర పర్యాటక శాఖ... పర్యాటక సంబంధిత సమస్యలను పరిష్కరించే అధికారం బౌన్సర్లకు లేదని పేర్కొంది. ఏ రూపంలోనైనా దాడి, బెదిరింపు లేదా దుష్ప్రవర్తన జరిగితే చట్ట అమలు అధికారుల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గోవా పోలీసులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా స్పందించిన పర్యాటక డైరెక్టర్ కేదార్ నాయక్... ఇటువంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఇది గోవా విలువలను ప్రతిబింబించదని అన్నారు. ఇటీవలి వెలుగులోకి వచ్చిన పలు సంఘటనల దృష్ట్యా.. పర్యాటక పోలీసులను పగలు, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, కీలక ప్రదేశాలలో నిఘా పెంచాలని కోరినట్లు తెలిపారు.

మరోవైపు.. గోవాను సందర్శించే ప్రతి వ్యక్తి ఇక్కడ సురక్షితంగా, సుఖంగా ఉండేలా చూసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని.. బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం.. పోలీసులు, పర్యాటక వాటాదారులతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే అన్నారు.


A shocking incident from #Arambol has raised concerns over tourist behaviour in #Goa.

A group of Indian tourists allegedly harassed female foreign tourists by clicking their photos without permission and attempting to hold them physically. pic.twitter.com/DrgLbekW71

— Hate Detector 🔍 (@HateDetectors) November 5, 2025


Tags:    
  • GoaTourism 
  • ArambolBeach 
  • TouristSafety 
  • BouncerMisconduct 
  • GoaPolice 
  • TravelSafe 
  • ViralVideo 
  • goanews 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS