ఈ అధికారికి 'భారతీయుడి' కష్టాలు... లంచాలపై షాకింగ్ పోస్ట్!

ఈ పోస్టు తమ దృష్టి వచ్చిన వెంటనే బెంగళూరు వైట్‌ ఫీల్డ్ పోలీస్‌ స్టేషన్‌ ఉన్నతాధికారులు తక్షణం స్పందించారు.;

Update: 2025-10-30 18:30 GMT

భారతదేశంలోని ప్రభుత్వ అధికారులు కొంతమంది ప్రజలను లంచాల పేరు చెప్పి ఏ స్థాయిలో వేధించుకుని తింటారనే విషయాన్ని వీలైనంత స్పష్టంగా చెప్పే ప్రయత్నమే కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అనే సంగతి తెలిసిందే! పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఆమ్యామ్యాలు తప్పవనే నానుడికి అది బలం! అది చూసిన చాలా మందికి వారి వారి అనుభవాలు గుర్తుకు వచ్చి ఉంటాయని చెప్పినా అతిశయోక్తి కాదేమో!

అలాంటి అనుభవాలు లేనివారు మాత్రం.. ఏదో సినిమా కాబట్టి ఆ స్థాయిలో చూపిస్తున్నారు కానీ, ప్రభుత్వ అధికారులు కొంతమంది మరీ అంత దుర్మార్గంగా ఉంటారా అని భావించి ఉండొచ్చు. ఈ క్రమంలో తాజాగా బెంగళూరుకు చెందిన ఒక రిటైర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తన కుమార్తె మరణించిన తర్వాత దహన సంస్కారాలకు సంబంధించిన పోస్ట్‌ మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ కోసం ప్రతి దశలోనూ లంచం ఇవ్వవలసి వచ్చిందని ఆరోపించారు.

అవును... భారతదేశంలోని కొంతమంది ప్రభుత్వ అధికారులను, లంచాలనూ వేరు చేసి చూడలేమని.. వారు, అవి అవిభక్త కవలలా అన్న స్థాయిలో వారి వ్యవహారం ఉంటుందని అంటుంTaaరు. ఇటీవల కాలంలో రిటైరైన తర్వాత దొరికిన ప్రభుత్వ అధికారుల ఆస్తుల వ్యవహారం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కుమార్తె మరణించిన బాధలో ఉన్నా కూడా లంచాలు ఇచ్చి విసిగిపోయానంటూ ఓ వ్యక్తి నెట్టింట్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (బీపీసీఎల్)లో సీఎఫ్‌ఓ gaa విధులు నిర్వర్తించినట్లు తన పోస్ట్‌ లో పేర్కొన్న కె.శివకుమార్ అనే వ్యక్తి... తన కుమార్తె అక్షయ శివకుమార్ (34) సెప్టెంబర్ 18న మెదడు రక్తస్రావంతో మరణించారని తెలిపారు. ఐఐఎం-అహ్మదాబాద్ పూర్వ విద్యార్థిని అయిన ఆమె గోల్డ్‌ మన్ సాచ్స్‌ లో ఎనిమిది సంవత్సరాలు సహా కార్పొరేట్ రంగంలో సుమారు 11 సంవత్సరాలు పనిచేశారని తెలిపారు.

అయితే.. ఆమె మరణించిన తర్వాత లాంఛనాలు పూర్తి చేసి, సంబంధిత పత్రాలు పొందేందుకు అంబులెన్స్ ఆపరేటర్లు, పోలీసు అధికారులు, శ్మశానవాటిక సిబ్బంది, స్థానిక యంత్రాంగానికి చెందిన ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి లంచం ఇవ్వాల్సి వచ్చిందని తన పోస్టులో వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు రాసుకొచ్చారు. ఇందులో భాగంగా... తన కుమార్తె మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు వసూలు చేశాడని తెలిపారు.

అనంతరం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోrT (ఎఫ్‌ఐఆర్) కాపీ, పోsTuమార్టం రిపోర్ట్ కోసం పోలీస్ స్టేషన్‌ కు వెళ్తే.. బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేశారని.. ఇదే క్రమంలో డెత్ సర్టిఫికెట్ కోసం నగర పౌర సంస్థ అయిన బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే సిబ్బంది ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు! ఈ సందర్భంగా... నా దగ్గర డబ్బు ఉంది.. ఇచ్చాను. కానీ పేదవాళ్ల పరిస్థితి ఏంటి..? ఇలా డబ్బు వసూలు చేసినప్పుడు తమకూ ఒక కుటుంబం ఉందన్న ఆలోచన వారికి రాదా..? అని ఆయన ప్రశ్నించారు!

ఇదే సమయంలో... బెలందూర్ పోలీస్ స్టేషన్‌ లోని ఒక అధికారి తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని, తన ఏకైక బిడ్డను కోల్పోయిన తండ్రి పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదని ఆరోపించారు.

స్పందించిన పోలీసులు!:

ఈ పోస్టు తమ దృష్టి వచ్చిన వెంటనే బెంగళూరు వైట్‌ ఫీల్డ్ పోలీస్‌ స్టేషన్‌ ఉన్నతాధికారులు తక్షణం స్పందించారు. ఇందులో భాగంగా... ఈ కేసులో లంచం ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు పోలీసులు (ఒక పీఎస్సై, ఒక కానిస్టేబుల్) ను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను సహించదని తెలిపారు.

నెటిజన్ల నిప్పులు!:

ఈ విధంగా తనకు జరిగిన ఇబ్బందులను వెల్లడిస్తూ ఎంతో ఉద్వేగానికి గురైన శివకుమార్.. ఆ తర్వాత తన పోస్ట్‌ ను తొలగించారు. అయినప్పటికీ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లు వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా అధికారుల్లో జవాబుదారీతనం లేకపోవడం, సమాజం మళ్లీ వెనక్కి పోతుందా అంటూ చాలా మంది ప్రశ్నించారు!

ఈ సందర్భంగా... భారతదేశంలో ఈ రకమైన లంచం ఇక జరగదని నేను భావించాను కానీ.. పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఏమాత్రం సున్నితంగా లేకపోవడం చాలా దురదృష్టకరం.. వారికి సమాజంలో ఏమాత్రం స్థానం లేదు అని ఒక వినియోగదారుడు స్పందించారు.

ఇదే క్రమంలో.. ప్రజలు డబ్బుకు అన్నింటికంటే ఎక్కువ విలువ ఇవ్వడం ప్రారంభించారు.. వారిని నిజాయితీపరులైన అధికారి అని పిలవడం కంటే వారిని ధనవంతులు అని పిలవడానికి ఇష్టపడతారు.. ఎందుకంటే.. ఇంటా, భయటా అంతా ఒకరు సంపాదించే డబ్బు ఆధారంగా గౌరవం ఇస్తున్నారు. మనం ఒక సమాజంగా కుంగిపోతున్నాము.. అని మరొక వ్యక్తి స్పందించారు.

మరోవైపు... ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చిన వారి వారి అనుభవాలను మరికొంతమంది పంచుకున్నారు.

Tags:    

Similar News