ఫేక్ అసభ్యకర వార్తలను ఆపేందుకు ఛాంబర్ పాలసీ
తెలుగు సినీపరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇకపై తప్పుడు వార్తలను, అసభ్యకర వార్తలను ప్రచారం చేసే మీడియా సంస్థలపై కొరడా ఝలిపించేందుకు తెలుగు ఫిలింఛాంబర్ ఒక కొత్త పాలసీని రూపొందిస్తోంది.;
తెలుగు సినీపరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇకపై తప్పుడు వార్తలను, అసభ్యకర వార్తలను ప్రచారం చేసే మీడియా సంస్థలపై కొరడా ఝలిపించేందుకు తెలుగు ఫిలింఛాంబర్ ఒక కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఆ మేరకు మీడియా సమక్షంలో ఛాంబర్ ప్రతినిధులు మీడియా సమక్షంలో ఒక సమావేశం నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సినిమా జర్నలిస్టుల్లో మీడియా, ప్రింట్ మీడియా, ఫోటో జర్నలిస్టులు, యూట్యూబ్ చానెళ్లు, మ్యాగజైన్లు సహా అన్ని మీడియా సంస్థలను పిలిచి ప్రత్యేకించి ఫిలింఛాంబర్ ఒక సమావేశం నిర్వహించింది. నటీనటులపై అసభ్యకర కామెంట్లు, అశ్లీలత, నటీనటులపై అసభ్యకర ప్రశ్నలు వేయడం వంటి వాటిని నివారించాలని ఛాంబర్ నిర్ణయించినట్టు ఈ సమావేశంలో తెలిపింది. తప్పుడు వ్యాఖ్యలతో యూట్యూబ్ లో థంబ్ నైల్స్ పెట్టేవారిపైనా ఛాంబర్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తప్పుడు వార్తలను సృష్టించేవారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఛాంబర్ భావిస్తోంది. ఇటీవలి సినిమా వార్తలపై చాలా కసరత్తు చేసాక ఈ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇటీవలి కొన్ని సంఘటనలను కూడా ఛాంబర్ ప్రతినిధులు ప్రస్థావించారు. అలాంటి వాటిని రిపీట్ చేయనివ్వకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. క్రియేటివిటీ పేరుతో ఇష్టం వాచినట్టు థంబ్ నెయిల్స్ ఫేక్ న్యూస్ లకు సరిహద్దులను నిర్ణయించాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమైందని భావిస్తున్నారు.