కోడలు మందు తాగుతోందని మామ ఫిర్యాదు..ఆఖరికి చిక్కుల్లో పడ్డ మామ.. ఇది కదా అసలు ట్విస్ట్!
ఈ మధ్యకాలంలో సమాజం ఏమైపోతోందో అర్థం అవడం లేదు. ఎన్నో ఊహించని వింత వింత ఘటనలు జరుగుతున్నాయి.;
ఈ మధ్యకాలంలో సమాజం ఏమైపోతోందో అర్థం అవడం లేదు. ఎన్నో ఊహించని వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు మంటలో కలిసిపోతున్నాయి. ఒకప్పుడు మానవ సంబంధాలు అంటే ఎంతో ప్రేమ ఆప్యాయతలతో కూడుకొని ఉండేవి. కానీ ఇప్పటి మానవ సంబంధాలు మాత్రం డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు పెళ్లిళ్లు జరిగితే చచ్చే వరకు తోడు నీడగా ఉండేవారు. కానీ ఇప్పటి జనరేషన్లో మాత్రం ఇలా పెళ్లిళ్లు చేసుకొని అలా విడాకులు తీసుకుంటున్న వాళ్లను ఎంతోమందిని చూస్తున్నాం. పెళ్లైన రెండు,మూడు నెలలకే పెళ్లైన విడాకులకు అప్లై చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలా పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని అంతలోనే విడాకులు తీసుకోవడం వారి కుటుంబీకులను మరింత బాధకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు కొడుకు - కోడలు విడాకులు తీసుకున్నారని తెలిసి, బాధ కోపంతో ఒక మామ చేసిన పని.. ఆఖరికి ఆయననే చిక్కుల్లో పడేలా చేసింది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
కొడుకుకి విడాకులు ఇచ్చిందనే కోపంతో కోడలిపై పగబట్టి మామ చేసిన పనికి.. చివరికి కోడలుతో పాటు మామ కూడా ఊహించని చిక్కుల్లో పడ్డారు. మరి ఇంతకీ అసలు విషయం ఏంటి అనేది చూస్తే.. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఫ్రెండ్షిప్ డే రోజు ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఈ విచిత్రమైన ఘటన చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.అంతేకాదు కోడలుపై పగ తీర్చుకుందామనుకున్న మామ కూడా షాక్ లో మునిగిపోయాడు. అసలు విషయం ఏమిటంటే.. గుజరాత్ లోని సూరత్ లో నివాసం ఉండే ఓ వ్యక్తి.. తన కోడలు.. తన కొడుకు నుండి విడాకులు తీసుకుంది అనే కోపంతో కోడలు పై పగబట్టాడు. కోడలు ఎక్కడికి వెళ్తోంది? ఏం చేస్తోంది ? అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఆమెపై నిఘా పెట్టారు.
అలా ఆమె ఫోన్ హ్యాక్ చేసి ఏం చేస్తోందనే సమాచారం తెలుసుకున్నాడు. అయితే ఫ్రెండ్షిప్ డే రోజు తన కోడలు తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ హోటల్లో మందు పార్టీ చేసుకుంది. ఇక ఈ పార్టీలో నలుగురు యువతులతో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మామ వెంటనే తన కోడలి బాగోతం బయట పెట్టాలని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ కి వెళ్లి మద్యం పార్టీ చేసుకున్న వాళ్లందర్నీ అదుపులోకి తీసుకున్నారు. కానీ పోలీసులకు మాత్రం ఈ విషయం ఎవరు చెప్పారు అనేది అర్థం కాలేదు.
ఆ తర్వాత విచారణ జరపగా కొడుకుతో విడాకులు తీసుకుందనే కోపంతో కోడలుపై పగబట్టిన ఒక మామ ఆ కోడలి మీద నిఘా పెట్టి ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తోంది ? అనే సమాచారం తెలుసుకోవడానికి స్టాకింగ్ చేశాడనే సంచలన విషయం పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఒకరి వ్యక్తిగత విషయాలను రహస్యంగా తెలుసుకోవడం అనేది చట్టరీత్యా నేరం.ఈ విషయం తెలిసిన పోలీసులు కోడలితోపాటు మామపై కూడా చర్యలు తీసుకొని ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని నువ్వు రహస్యంగా ఎలా తెలుసుకుంటావు అంటూ కేస్ ఫైల్ చేసి మామకి కూడా షాక్ ఇచ్చారు. అలా కోడల్ని ఇరికిద్దామనుకుంటే మామ కూడా చిక్కుల్లో పడ్డాడు.అయితే ఫ్రెండ్షిప్ డే రోజు జరిగిన ఈ ఘటన ప్రస్తుతం గుజరాత్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.