ఇదేం అభిమానం సామీ.. జగన్ క్యాంప్ ఆఫీసు కిటికీ అద్దాలు బద్ధలు
బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు తన సొంత నియోజకవర్గానికి వస్తుంటారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.;
అభిమానం ఉండాల్సిందే. దాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ మోతాదు మించకూడదు. తాము అమితంగా అభిమానించి.. ఆరాధించే అధినేతను కలిసేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. ఆయన క్యాంప్ కార్యాలయం కిటికి అద్దాలు పగిలే వరకు వెళ్లటం దేనికి నిదర్శనం? అభిమానం ఉన్నప్పుడు అంతే క్రమశిక్షణ ఉండాలి కదా? అభిమాన అధినేతను చూసేందుకు అత్సుత్సాహంతో వ్యవహరిస్తే చెడ్డపేరు వచ్చేదెవరికి? అన్న ప్రశ్నను వైసీపీ క్యాడర్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతమే దీనికి నిదర్శనం.
బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు తన సొంత నియోజకవర్గానికి వస్తుంటారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్ నిర్వహించారు. తమ అభిమాన అధినేతను చూసేందుకు జగన్ అభిమానులు పోటీ పడ్డారు. తమ సమస్యల్ని విన్నవించుకునేందుకు క్యాంప్ ఆఫీసుకు పోటెత్తారు.
అందరూ ధైర్యంగా ఉండాలని.. త్వరలోనే తమ ప్రభుత్వం వస్తుందని.. తమ ప్రభుత్వం రాగానే అందరికి మంచి జరుగుుతందని పేర్కొన్నారు. అయితే.. జగన్ నిర్వహించే ప్రజాదర్బార్ కు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాయి. దీంతో.. అక్కడ తోపులాట చోటు చేసుకుంది.
వైసీపీ క్యాడర్ అత్యుత్సాహంతో ఒక్కసారిగా పడటంతో క్యాంప్ కార్యాలయం కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయర్ వారిని చెదరగొట్టారు. జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్ వేల.. అక్కడే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి.. రమేశ్ యాద్.. ఎమ్మెల్యే సుధ.. ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ఉదంతాన్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. జగన్ మీద హద్దులు దాటేంత అభిమానం ఉండటం తప్పు కాదు. న కారణంగా అధినేత ఇరుకునపడేలా వ్యవహరించకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.