ఈ 20తో మైలేజ్ దెబ్బ...వాహానాలు చెక్ చేసుకోవాల్సిందే !
పెట్రోల్ తో ఇథనాల్ మిశ్రమం చేయడం వలల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అది బాగా తగ్గిస్తుంది, కార్బన్ మోనాక్సైడ్‌ను పెద్ద ఎత్తున తగ్గిస్తుంది. అలాగే హైడ్రో కార్బన్ ఉద్గారాలను సైతం బాగా తగ్గిస్తుంది.;
ఏ వాహనం కొన్నా ఎవరైనా చూసేది మైలేజ్ నే ఎందుకంటే పెట్రోల్ ఎవరికీ ఉచితంగా దొరకదు. అంతే కాదు అది భారంగా మారిపోతోంది. దాంతో ఎక్కువ మైలేజ్ ఉన్న వాహనాలనే ఎవరైనా ఇష్టపడతారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల పాత వాహనాలకు మైలేజ్ దెబ్బ పడనుంది. 2023 ముందు నిర్మాణం అయిన వాహనాలను ఎవరైనా వాడుతూంటే మాత్రం వారి వాహనాలు మైలేజ్ షాక్ కి గురి అవుతాయని అంటున్నారు.
ఫుల్ డ్యామేజ్ అవుతాయా :
కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం అలాగే ఇంధన కాలుష్యాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం చూస్తే ఇథనాల్ మిశ్రమాన్ని పెట్రోల్ లో కలుపుతారు. ఇది ఇరవై శాతం మిక్స్ చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల పెట్రోల్ తో పాటు ఇధనాల్ కూడా కలిసి వాహనంలోకి వెళ్తుంది. ఈ ఇరవై శాతం ఇధనాల్ అన్నది కచ్చితం చేస్తున్నరు. దేశంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ20 పెట్రోల్ అంటే పెట్రోల్‌ను 20 శాతం ఇథనాల్‌తో కలిపి సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలో ఇది అమలు అవుతుంది అని అంటున్నారు.
ఇథనాల్ మిశ్రమంతో మేలు :
పెట్రోల్ తో ఇథనాల్ మిశ్రమం చేయడం వలల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అది బాగా తగ్గిస్తుంది, కార్బన్ మోనాక్సైడ్‌ను పెద్ద ఎత్తున తగ్గిస్తుంది. అలాగే హైడ్రో కార్బన్ ఉద్గారాలను సైతం బాగా తగ్గిస్తుంది. ఇలా వ్యవసాయ రంగానికి రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అలాగే పెట్రోల్ దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతోందని చెబుతున్నారు.
నేరుగా ఇంజిన్ మీద ప్రభావం:
అయితే ఈ20 మిశ్రమం అనేది ఒక వైపు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుండగా మరో వైపు పాత వాహనాలపై దాని ప్రభావం గురించి కూడా అనేక రకాలైన ఆందోళనలు ఉన్నాయి, ఎందుకంటే ఇంజిన్లు అనుకూలంగా లేకుంటే అధిక ఇథనాల్ వినియోగం వల్ల ఇంజన్ సహా కీలక భాగాలు తుప్పు పట్టేందుకు కారణమవుతుంది. దీని వల్ల తొందరగా పాత వాహనాలు పాడైపోయే చాన్స్ ఉంది అని అంటున్నారు. అదే కొత్త వాహనాలు అయితే వాటికి ఈ20 పెట్రోల్ వాడకాన్ని తట్టుకునే విధంగా వాహన భాగాలను రెడీ చేసి ఉంచారని అంటున్నారు.
మైలేజ్ ఢమాల్ :
మరో వైపు చూస్తే మైలేజ్ కూడా పాత వాహనాలలో బాగా తగ్గిపోతుంది అని అంటున్నారు. ఈ20 పెట్రోల్ ని వాడితే కనుక లీటర్ కి 50 కిలోమీటర్లు రావాల్సింది 40 కి పడిపోతుంది అని అంటున్నారు. ఇక ఈ20 పెట్రోల్ వినియోగం పనికి రాదు అన్నది 2023 ముందు వాహనాలకు అంటున్నారు. అవి కార్లు అయినా బైక్స్ అయినా వాటికి ఈ20 పెట్రోల్ వాడితే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అయితే వాటిని మరి ఏమి చేయాలి అంటే తరచూ సర్వీసు చేయిచాలని సూచిస్తున్నారు. దాంతో పాత వాహనదారులకు దాని నిర్వహణ పెను భారం అవుతుంది అని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మిశ్రమ స్పందన లభిస్తోంది. ఏప్రిల్ నుంచి ఎ20 పెట్రోల్ వినియోగం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని అంటున్నారు.