ట్రంప్‌తో కయ్యం.. చిక్కుల్లో 'మస్క్'.. భారీ నష్టం తప్పదా!
ఎలాన్ మస్క్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టెస్లా..కార్ల దిగ్గజంగానే కాకుండా.. అంతరిక్ష రంగంలోనూ ఆయనకు పేరుంది.;
ఎలాన్ మస్క్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టెస్లా..కార్ల దిగ్గజంగానే కాకుండా.. అంతరిక్ష రంగంలోనూ ఆయనకు పేరుంది. ఇక, ట్విట్టర్ కొనుగోలు ద్వారా సోషల్ మీడియాలోనూ ఆయన భారీగా నే సంపాయించుకుంటున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన ట్రంప్‌కు మద్దతు దారుగా ఉండి భారీ ప్రచారం చేశారు. అయితే.. కొన్నాళ్ల కిందటే ట్రంప్‌కు ఆయనకు చెడింది. మస్క్‌పై నానా దుర్భాషలతో ట్రంప్ విరుచుకుపడ్డారు.
అయితే.. ఈ రగడ జరిగిన కొన్ని నెల్లలోనే మస్క్‌కు భారీ షాక్ తగిలింది. అది కూడా ట్రంప్‌కు పోటీగా ఉన్న ట్విట్టర్‌తోనే కావడం గమనార్హం. 2022లో ట్విట్టర్ సంస్థను మస్క్ కొనుగోలు చేశారు. వాస్తవానికి 2006లోనే ట్విట్టర్‌ను జాక్ డార్సీ, నోహ్ గ్లాస్, బిజ్ స్టోన్, ఎవాన్ విలియమ్స్ కలిసి స్థాపించారు. అనంతరం.. ఇది బాగా పాపులర్ కావడంతో మస్క్ దీనిని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం.. దీనికి `ట్విట్టర్` పేరు తీసేసి.. `ఎక్స్`గా పెట్టారు.
ఏంటి వివాదం..
అయితే.. ఇప్పుడు `ఎక్స్` వివాదంలో చిక్కుకుంది. ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు.. ప్రాథమిక యజమానిగా మస్క్ ఉన్నారు. కానీ, దీని సహ కొనుగోలు దారులుగా.. లేదా పెట్టుబడి దారులుగా సౌదీ రాజు అల్వీద్ సహా.. దుబాయ్‌కు చెందిన పలు కంపెనీలు కూడా ఉన్నాయి. తాజాగా.. వీరు.. మస్క్ తమను మోసం చేశారని ఆరోపించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు.. కొన్ని నెలల పాటు తమను తికమకలో పెట్టి.. షేర్ల విలువను తగ్గించేలా చేశారని.. తద్వారా.. తాము నష్టపోయామని వారు ఫిర్యాదు చేశారు.
దీనిపై తాజాగా న్యాయనిపుణుల సంఘం దీనిపై విచారణ చేసింది. మస్క్ చేసింది మోసమేనని నిర్ధారించింది. `ఎక్స్` షేర్ విలువ తగ్గించేలా ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంది. తద్వారా.. పెట్టుబడి దారులు నష్టపోయారని తెలిపింది. మొత్తం 9 మంది న్యాయనిపుణులు చేసిన విచారణ అనంతరం.. సదరు నష్టాన్ని మస్క్ తిరిగి చెల్లించాలని ఆదేశించారు. పెట్టుబడి దారులను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేసింది.
ఎలా నష్టపోయారంటే..
ట్విట్టర్‌లో పెట్టుబడి పెట్టిన వారు.. మస్క్ కొనుగోలు చేసిన తర్వాత కూడా కొనసాగాలని భావించారు. వీరిలో సౌదీ రాజు సహా.. పలువురు ఉన్నారు. అయితే.. కొనుగోలు చేయడానికి ముందే.. షేర్లు ప్రభావిత మయ్యేలా మస్క్ వ్యవహరించారు. దీంతో ఒక్కొక్క స్టాకు.. అప్పటి వరకు 80 డాలర్లు ఉండగా.. 54 డాలర్లకు పడిపోయింది. అనంతరం.. మస్క్ దానిని కొనుగోలు చేశారు. దీంతో తాము నష్టపోయాయని.. తక్కువ ధరలకే మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారని వారు పేర్కొన్నారు.