ఎలాన్ మస్క్ vs అమెరికన్ మీడియా : ఏంటీ డ్ర*గ్స్ గొడవ?
ప్రపంచ ప్రసిద్ధ టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు.;

ప్రపంచ ప్రసిద్ధ టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. అమెరికాలోని ప్రముఖ పత్రికలు వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ), న్యూ యార్క్ టైమ్స్ (NYT) పత్రికలపై తీవ్ర విమర్శలు చేస్తూ, వారి చిత్తశుద్ధిని ప్రశ్నించారు.

"వాళ్లు నాపై అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు చూద్దాం వారి డ్ర*గ్ టెస్ట్ ఫలితాలు ఎలా ఉంటాయో. తప్పకుండా ఫెయిలవుతారు!" అంటూ ఎలాన్ మస్క్ తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు టెక్, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

-మీడియా చిత్తశుద్ధిపై మస్క్ ప్రశ్నలు
ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూ యార్క్ టైమ్స్ పత్రికలు టెస్లా కంపెనీ ఉత్పత్తి సమస్యలు, ఎస్.ఈసీ విచారణల గురించి కథనాలు ప్రచురించాయి. అయితే మస్క్ వాటిని పూర్తిగా అవాస్తవం, అసంబద్ధమైన కథనాలు అంటూ ఖండించారు. పత్రికలపై నేరుగా డ్ర*గ్ టెస్ట్ సవాల్ విసరడం మస్క్‌కు ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన 'కార్పొరేట్ మీడియా'పై తీవ్ర విమర్శలు చేశారు. "సత్యం కంటే మనసులో ఉన్న అజెండాను ప్రాధాన్యం ఇచ్చేలా ఈ పత్రికలు మారిపోయాయి" అని మస్క్ పలుమార్లు ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూ యార్క్ టైమ్స్ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు.
-ఎప్పటికీ వివాదాల్లో ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. SEC, షార్ట్ సెలర్స్, AI పరిశోధక సంస్థలు వంటి అనేక ప్రముఖ సంస్థలతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. మీడియాలో కూడా ఆయనకు మంచి సంబంధాలు లేవనే చెప్పాలి. కొందరైతే "మీడియా అసత్య ప్రచారాన్ని మస్క్ బట్టబయలు చేస్తున్నాడు" అంటుండగా మరికొందరు "వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే ఇది" అని మస్క్ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.
ఎలాన్ మస్క్ మరోసారి తన అనూహ్యమైన, నిప్పులు చెరిగే వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.