• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నా బిడ్డకు తండ్రి ఎలాన్ ...

నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్... నెంబర్ 13?

| ఎలాన్ మస్క్ కు సంబంధించి రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఓ సంచలన పోస్ట్ పెట్టారు.

By - Tupaki Desk
Update: 2025-02-15 10:40 GMT

ఇంతకాలం కుబేరుడిగా ప్రపంచానికి పరిచయం అయిన ఎలాన్ మస్క్.. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.. ఇప్పుడు ట్రంప్ 2.0లో డొజ్ సారథిగా కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. తన బిడ్డకు మస్క్ తండ్రి అని ఓ రచయిత్రి పోస్ట్ పెట్టారు.

అవును... ఎలాన్ మస్క్ కు సంబంధించి రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా తన బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు. తమ బిడ్డ గోప్యత, భద్రత దృష్ట్యా ఈ విషయాన్ని తాను ఇంతకుముందు బహిర్గతం చేయలేదని ఆమె తాజాగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆమె.. తాను ఐదు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చానని.. ఆ చిన్నారికి తండ్రి ఎలాన్ మస్క్ అని.. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నించాయని.. అందుకే తానే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని.. తమ సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని తాను కోరుకుంటున్నానని అమె వెల్లడించారు.

తమ బిడ్డ గోప్యత, భద్రత దృష్ట్యా ఇంతకముందు తాను ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని.. ఈ సందర్భంగా తమ గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె తన పోస్టులో కోరారు. అయితే... ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు!

కాగా... ఎలాన్ మస్క్ కు ఇప్పటికే 12 మంది సంతానం అనే సంగతి తెలిసిందే. మస్క్ మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందగా.. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ విధానం ద్వారా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిద్దరూ 2008లో విడిపోయారు.

ఆ తర్వాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ వివాహమాడారు. అయితే వారికి సంతానం లేదు! ఈ క్రమంలో.. కెనడియన్ గాయని గ్రిమ్స్ తో సంబంధం నడిపారు టెస్లా సీఈఓ! అయితే.. వారికి ముగ్గురు సంతానం కలిగారు. ఈ క్రమంలో... న్యూరాలింక్ లో పనిచేస్తోన్న ఎగ్జిక్యూటివ్ తోనూ మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు ఎలాన్ మస్క్!

Alea Iacta Est pic.twitter.com/gvVaFNTGqn

— Ashley St. Clair (@stclairashley) February 15, 2025
Tags:    
  • ElonMusk 
  • AshleySaintClair 
  • ChildRevelation 
  • ElonMuskFamily 
  • ElonMuskChildren 
  • Allegations 
  • ElonMusknews 
  • TeslaCEO 

Similar News

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

Copyright @2026

Powered by Blink CMS