సర్వేల అంచనా నిజమైందా?.. ఎక్కడెక్కడ ఎలా ఎలా?
అనేక సర్వేలు .. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ముందుగానే ఫలితాన్ని వెలువరిం చాయి.;
అనేక సర్వేలు .. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ముందుగానే ఫలితాన్ని వెలువరించాయి. అయితే.. ఐదు రాష్ట్రాల్లోనూ.. అందరూ ఊహించినట్టుగా ఫలితం వచ్చిందా? అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడులో సర్వేలు తలకిందులు అయ్యాయి. ఒక్క యాక్సస్ మై ఇండియా. సీనియర్ మాజీ ఐపీఎస్ అదికారి రవి నేతృత్వంలో సాగిన సర్వేలు మాత్రమే విజయ్‌కు ఎడ్జ్ ఉంటుందని చెప్పాయి. మిగిలిన ప్రతిష్టాత్మక సర్వేలన్నీ.. విజయ్ వెనుకబడడం ఖాయమనే చెప్పాయి.
ఇక, పశ్చిమ బెంగాల్‌లోనూ.. పోరు తీవ్రంగా ఉంటుందనిసర్వే సంస్థలు అంచనా వేశాయి. కానీ, ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత.. ఒకింత హోరా హోరీ కనిపించినా.. ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ బీజేపీ దూసుకుపోతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే.. బీజేపీకి ఎదురు లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ ఏకపక్షంగా 190 స్థానాలు దాటేసింది. కానీ సర్వే సంస్థలుఅన్నీ కూడా.. బీజేపీ గెలుస్తుందని చెప్పినా.. సంఖ్యా పరంగా మాత్రం 20 - 30 స్థానాలు తేడా ఉండడం గమనార్హం.
ఇక, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి(బీజేపీ నేతృత్వంలో) ఏకపక్షంగా విజయం దక్కించుకుంటుందని సర్వేలు చెప్పాయి. కానీ, ఇక్కడ అతి కష్టం మీద ఈ కూటమి విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. డీఎంకే నేతృత్వంలోని కూటమి బలమైన పోటీ ఇచ్చింది. మొత్తం 30 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఏకపక్షంగా ఎన్డీయే కూటమి 25 చోట్ల విజయం దక్కించుకుంటుందని సర్వేలు చెప్పాయి. కానీ, 20 స్థానాలకే ఆ కూటమి పరిమితం అయినట్టు తెలుస్తోంది.
కేరళలో కూడా సర్వేలు తప్పయ్యాయి. అధికారం దక్కించుకునే విషయంలో మాత్రమే అవి సక్సెస్ అయినా.. సంఖ్యా పరంగా చూస్తే.. కాంగ్రెస్ నేతృత్వంలోని.. యూడీఎఫ్ కేవలం 70-90 మధ్య స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పినా.. తాజా గా వచ్చిన ఫలితాన్ని చూస్తే.. 102 స్థానాలు దాటిపోయింది. ఇలా.. సర్వే రాయుళ్లలో కొంత తడబాటు కనిపించింది. ముఖ్యంగా తమిళనాడులో అయితే.. సర్వే సంస్థలు పూర్తిగా చేతులు ఎత్తేశాయనే చెప్పాలి.