భూమి పొర చిరిగిపోతుందా? షాకింగ్ నిజం వెలుగులోకి!
ఖండాల మధ్య భూగర్భ పొర చీలిపోవటంతో దాని అడుగున ఉన్న శిలాద్రవ మ్యాంటిల్ పొర నుంచి భడభాగ్ని లాంటి శిలాద్రవం బయటకు ఎగజిమ్మే ముప్పు పొంచి ఉంది.;
శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనం ఒకటి షాకింగ్ అంశాల్ని వెలుగులోకి వచ్చేలా చేసింది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే అఖండంగా ఉన్న భూగోళం.. ఖండాలు మాదిరి విడిపోయిన వైనం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. ఖండాలుగా విడిపోయిన సంగతి అలా ఉంటే.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఇవి నెమ్మదిగా దూరంగా జరుగుతున్నాయని.. వీటి కారణంగా మహాసముద్రాల అడుగున వందల కిలోమీటర్లలోతులోనూ భూమి పొర చీలిపోతుందన్న షాకింగ్ అంశాన్ని గుర్తించారు. దూరంగా జరిగితే మనకు వచ్చే నష్టమేమీ లేదని అనుకోవటం తప్పే అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఖండాల మధ్య భూగర్భ పొర చీలిపోవటంతో దాని అడుగున ఉన్న శిలాద్రవ మ్యాంటిల్ పొర నుంచి భడభాగ్ని లాంటి శిలాద్రవం బయటకు ఎగజిమ్మే ముప్పు పొంచి ఉంది. దీని కారణంగా లెక్కలేనన్ని అగ్నిపర్వతాలు పుట్టుకొచ్చే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. కొత్త అగ్నిపర్వతాలు కోట్ల ఏళ్లుగా అలానే శిలాద్రవం.. మాగ్మాను ఎగజిమ్మే పెను ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా అగ్నిపర్వతాల పుట్టుక విషయానికి వస్తే.. వేర్వేరు భూఫలకాల కొనలు పరస్పరం ఢీ కొనటం.. రాపిడి సందర్భాల్లోనే అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. తాజాగా గుర్తించిన అంశాలకు వస్తే.. కొత్తగా పుట్టుకొచ్చే అగ్నిపర్వతాలు సముద్రగర్భంలో ఏర్పడి.. కోట్ల ఏళ్ల పాటు అవి అలాగే క్రియాశీలకంగా ఉండిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ స్టిములేషన్ విధానంలో ఖండాల చీలిక కారణంగా కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత జరిగే విపరిణామాలను అమెరికాలోని పలు వర్సిటీ పరిశోధకుల టీం సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాల్ని గుర్తించారు.