దుర్గేష్ చెప్పింది నిజం: పవన్ మాట వింటారా?
జనసేన నాయకుడు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలో చర్చకు దారి తీశాయి. ఆయనకు మద్దతుగా పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు.;
జనసేన నాయకుడు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలో చర్చకు దారి తీశాయి. ఆయనకు మద్దతుగా పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ ఇద్దరి వాదన కూడా పెద్దగా పరిగణనలోకి రాలేదనే చెప్పాలి. విషయం ఏంటంటే.. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో తాము ఎదుర్కొంటున్న సమస్యను దుర్గేష్ చెప్పుకొచ్చారు. తమ మాటను ఎవరూ వినిపించుకోవడం లేదని.. పర్యాటక శాఖకు చెందిన కార్యదర్శులే అన్నీ చేస్తున్నారని అన్నారు.
నిజానికి మంత్రి దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ అనే చెప్పాలి. ఆయన అక్కడితో కూడా ఆగకుం డా.. తన పర్యాటక శాఖకు సంబంధించి పలు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నానని.. అవి వస్తున్నాయని తెలిపారు. కానీ, ఆ తర్వాత జరుగుతున్న కొన్ని వ్యవహారాలను తన వద్దకు రాకుండానే.. కార్యదర్శులు చక్కబెడుతున్నారని, దీంతో కొందరు పెట్టుబడులు పెట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అసలు కార్యదర్శుల మాట మంత్రి వినాలా. మంత్రి చెప్పింది కార్యదర్శి చేయాలా? అని ప్రశ్నించారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ సమస్య తనకు కూడా ఎదురైం దన్నారు. సెక్రటరీ స్థాయిలో వర్క్ ఉంటుందని.. కానీ, వారే సర్వం అయిపోతే ఎలా? అని పవన్ ప్రశ్నిం చారు. అంటే.. ఈ విషయాన్ని గమనిస్తే.. మంత్రులకు శాఖలపై పట్టు ఉందా? లేదా? అనేది పక్కన పెడితే.. సెక్రటరీలుగా ఉన్న ఐఏఎస్ లు మంత్రులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదన బలంగా వినిపించింది. మంత్రి దుర్గేష్ సహా డిప్యూటీ సీఎం కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే.. రెమెడీ ఏంటి? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. సీఎం చంద్రబాబు మంత్రులే పైచేయి సాధించాలని చెప్పినా.. వాస్తవానికి అధికారులు ఇంత స్థాయిలో పైచేయి సాధించడానికి గల కారణాలను మాత్రం ఆయన విశ్లేషించలేకపోయారు. అంతేకాదు.. అదేసమావేశంలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోనూ ఆయన చర్చించలేదు. ఈ పరిణామాలు.. మంత్రి దుర్గేష్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. పవన్ చెప్పినా .. ఈ విషయంలో మార్పు వస్తుందో రాదో అనే సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.