• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డాక్టర్లకే షాకిచ్చాడు.....

డాక్టర్లకే షాకిచ్చాడు.. అతడి పొట్టలో మేకులు..సూదులు

| తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఒక వ్యక్తికి సర్జరీ చేసిన వైద్యుల టీం షాక్ తింది.

By - Tupaki Desk
Update: 2024-05-29 04:12 GMT

తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఒక వ్యక్తికి సర్జరీ చేసిన వైద్యుల టీం షాక్ తింది. అతడి పొట్టలో కుప్పలా ఉన్న వస్తువులను చూసిన వైద్యులకు నోట మాట రాలేదు. సదరు వ్యక్తి పొట్టలో మేకులు.. సూదులు.. తాళం చెవులతోపాటు పలు ఇతర వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంతకూ అతడెవరు? ఎక్కడి వాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన ఒక యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో పట్టణంలోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చేరాడు. అతడి పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే అతడికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అతడి పొట్టను ఎక్స్ రే.. సిటీ స్కాన్ లాంటి పరీక్షల్ని నిర్వహించారు.

దాని ఫలితం చూసిన తర్వాత నోటి మాట రాని పరిస్థితి. కారణం.. అతడి పొట్టలో పెద్ద ఎత్తున సూదులు.. మేకులు ఉండటమే. దీనికి తోడు నట్లు.. బోల్టులు లాంటివి ఉన్నట్లుగా గుర్తించారు. వీటిల్లో కొన్ని పెద్దపేగులోకి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఈ కారణంతోనే తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నట్లుగా తేల్చారు. వెంటనే శస్త్ర చికిత్స చేశారు. దీంతో అతడికి లాప్రోస్కోపీ.. కొలనో స్కోపీని నిర్వహించారు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన శస్త్ర చికిత్స అనంతరం పెద్ద ఎత్తున పేరుకున్న వస్తువుల్ని తొలగించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి బాగున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. రోగి మానసిక పరిస్థితి బాగోదని.. ఈ కారణంగానే అతను ఇలా చేస్తుంటాడని గుర్తించారు. ఏమైనా.. అతడి పొట్ట నుంచి బయటకు తీసిన వస్తువుల గురించి తెలిసిన వారంతా నోట మాట రాని పరిస్థితి.

Tags:    
  • Doctor 
  • Rajasthan 
  • Jaipur 
  • Operation 
  • Savaimansinghhospital 
  • Patient 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS