• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్ని నిబంధనలు పెట్టినా ఈ...

ఎన్ని నిబంధనలు పెట్టినా ఈ ఢిల్లీని కాపాడలేరు

| దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గ్రీన్ క్రాకర్స్, టపాసులపై సుప్రీంకోర్టు ఆంక్షలు ఉన్నా అమలు సరిగా జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. పీఎం 2.5 స్థాయిలు సాధారణ ప్రమాణం కంటే దాదాపు పది రెట్లు పెరిగినట్లు కథనం పేర్కొంది. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ఈ కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది.

By - A.N.Kumar
Update: 2026-11-09 19:14 GMT

పండుగ వెలుగుల మాటున విషపూరితమైన గాలి.. ఆకాశంలో రంగురంగుల బాణసంచా వెలుగులు.. నేలపై పెరిగిపోతున్న కాలుష్యం.. సుప్రీంకోర్టు ఆంక్షలు.. గ్రీన్ క్రాకర్స్ నిబంధనలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయా? దీపావళి తర్వాత మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఎన్ని నిబంధనలు పెట్టినా దేశ రాజధాని ఢిల్లీ పొల్యూషన్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆఖరుకు డైరెక్టుగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగినా పని కావడం లేదంటే ఢిల్లీ కాలుష్యాన్ని ఎవరూ తగ్గించలేరన్న వాస్తవం బోధపడుతోంది.

దీపావళి అంటే దీపాల వెలుగులు.. ఆనందాలు.. కుటుంబ సభ్యుల సందడి.. చిన్నారుల కేరింతలు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ పండుగ ముగిసిన తర్వాత మిగిలేది ఆనందం కంటే ఆందోళనే ఎక్కువ. తెల్లవారితే చాలు.. కిటికీలు తెరిస్తే స్వచ్ఛమైన గాలి రావాల్సిన నగరంలో పొగమంచులా కమ్ముకున్న విషపూరితమైన వాయువులు స్వాగతం పలుకుతున్నాయి. పండుగ పేరుతో కాల్చిన టపాసుల వెలుగులు కొన్ని గంటలే ఉంటే.. వాటి నుంచి వెలువడిన కాలుష్యం మాత్రం రోజుల తరబడి ప్రజలను వెంటాడుతోంది.

సుప్రీంకోర్టు ఆదేశాలు.. ఆంక్షలు అన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? గ్రీన్ క్రాకర్స్ పేరుతో జరుగుతున్న దందా ఎవరిని మోసం చేయడానికి? రాత్రి సమయంలో కేవలం కొన్ని గంటలు మాత్రమే పటాసులు కాల్చాలని నిబంధనలు పెట్టినా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మోగిన బాణసంచా చప్పుళ్లే ఇందుకు నిదర్శనం. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకునేవారేరి? ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన చట్టాలు అమలుకాకపోతే వాటి వల్ల ప్రయోజనం ఏమిటి?

గ్రీన్ క్రాకర్స్ వల్ల కాలుష్యం 30 శాతం తగ్గుతుందని చెబుతున్నప్పటికీ కాలుష్యం తగ్గడం వేరు.. అసలు లేకపోవడం వేరు. దీపావళి రాత్రి ఢిల్లీలో పీఎం 2.5 స్థాయిలు ప్రమాదకర స్థాయిని మించిపోయాయి. సాధారణ ప్రమాణం కంటే దాదాపు పది రెట్లు ఎక్కువగా విషం గాలిలో కలిసింది. గ్రీన్ పేరుతో సాధారణ టపాసులనే మార్కెట్లో అమ్ముతున్నారనే ఆరోపణలు పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతున్నాయి. క్యూఆర్ కోడ్‌లు, ప్రత్యేక తనిఖీలు క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడం అధికారుల ఉదాసీనతను ఎత్తిచూపుతోంది.

ఈ కాలుష్యానికి బలైపోతున్నది ఎవరో కాదు.. పసిపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న సామాన్య ప్రజలే. ఒక చిన్నారి కాల్చిన పటాసు ఆకాశంలో రంగులు చల్లుతుండవచ్చు.. కానీ ఆ కంటికి కనిపించని విషం గాలిలో కలిసి చిన్నారుల ఊపిరితిత్తులను చిదిమేస్తోంది. పండుగ పేరుతో మనుషుల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

టపాసులపై ఆంక్షలు విధించడంతోనే సమస్య తీరదు. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం నుంచి వెలువడే ధూళితో పాటు పండుగ కాలుష్యాన్ని అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరం. ప్రభుత్వాల కఠిన నిబంధనలతో పాటు ప్రజల్లోనూ మార్పు రావాలి. సంబరాలు మన సంతోషాన్ని పంచాలి తప్ప, తోటివారి ప్రాణాలకు ముప్పుగా మారకూడదు. ఈ గాలిని పీల్చేది మనమే.. మన పిల్లలే అనే సత్యాన్ని గ్రహించి, బాధ్యతాయుతమైన పండుగను ఆచరించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే ఢిల్లీ కాలుష్యానికి ఒక గొప్ప పరిష్కారం లభిస్తుంది.

Tags:    
  • delhipollution 
  • delhiairquality 
  • diwalipollution 
  • greencrackers 
  • airpollution 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS